దిక్కుల నీ కతలెల్లాఁ దెలిసెఁ గాక
(॥పల్లవి॥)
దిక్కుల నీ కతలెల్లాఁ దెలిసెఁ గాక
వెక్కసాన నిన్ను నా వెంటవెంటఁ దిప్పనా
(॥దిక్కు॥)
యితరులు పిలిచితే నెఁతైనాఁ బలుకవు
సతిమాటకై తేను జవదాఁటవు
ప్రతినలాడుకోఁగా నీపలుకుల భ్రమయించి
వెతదీర నిన్ను నావెంటవెంటఁ దిప్పనా
(॥దిక్కు॥)
సరస మెవ్వరాడినా సరకుఁ గొనవుగాని
తరుణి నవ్వినంతేనే తమకించేవు
సరవులు దప్పఁగాని చలపట్టి నే నిన్ను
విరివిగా వలపించి వెంటవెంటఁ దిప్పనా
(॥దిక్కు॥)
కొలువులో నెవ్వరున్నాఁ గూరిమిసేయవుగాని
కలికిఁ బొడగంటేనే కరఁగేవు
మెలఁగి శ్రీవేంకటేశ మీరఁగాని నిన్నుఁ గూడి
వెలయ సిగ్గులుమాన్పి వెంటవెంటఁ దిప్పనా
(||pallavi||)
dikkula nī kadalĕllām̐ dĕlisĕm̐ gāga
vĕkkasāna ninnu nā vĕṁṭavĕṁṭam̐ dippanā
(||dikku||)
yidarulu piliside nĕm̐tainām̐ balugavu
sadimāḍagai tenu javadām̐ṭavu
pradinalāḍugom̐gā nībalugula bhramayiṁchi
vĕdadīra ninnu nāvĕṁṭavĕṁṭam̐ dippanā
(||dikku||)
sarasa mĕvvarāḍinā saragum̐ gŏnavugāni
taruṇi navvinaṁtene tamagiṁchevu
saravulu dappam̐gāni salabaṭṭi ne ninnu
virivigā valabiṁchi vĕṁṭavĕṁṭam̐ dippanā
(||dikku||)
kŏluvulo nĕvvarunnām̐ gūrimiseyavugāni
kaligim̐ bŏḍagaṁṭene karam̐gevu
mĕlam̐gi śhrīveṁkaḍeśha mīram̐gāni ninnum̐ gūḍi
vĕlaya siggulumānpi vĕṁṭavĕṁṭam̐ dippanā