Dikku neeve jeevulagu devasimhamaa

దిక్కు నీవే జీవులకు దేవసింహమా
Language

(॥పల్లవి॥)
దిక్కు నీవే జీవులకు దేవసింహమా
తెక్కుల గద్దియమీఁది దేవసింహమా

(॥దిక్కు॥)
సురలెల్లాఁ గొలువఁగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతిఁ బ్రహ్లాదుఁడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా

(॥దిక్కు॥)
భుజము లుప్పొంగఁగాను పూఁచిన శంఖుఁజక్రాల
త్రిజగముల నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి-
ద్విజమునిసంఘముల దేవసింహమా

(॥దిక్కు॥)
ముప్పిరిదాసులకెల్లా ముందు ముందే యొసగేటి-
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవేంకటాద్రిమీఁద
తెప్పల దేలేటియట్టి దేవసింహమా

(||pallavi||)
dikku nīve jīvulagu devasiṁhamā
tĕkkula gaddiyamīm̐di devasiṁhamā

(||dikku||)
suralĕllām̐ gŏluvam̐ga sūryasaṁdrulagannula
tiramaina mahimala devasiṁhamā
niradim̐ brahlādum̐ḍu nīyĕduḍa niliside
tĕradīsidi māyagu devasiṁhamā

(||dikku||)
bhujamu luppŏṁgam̐gānu pūm̐sina śhaṁkhum̐jakrāla
trijagamula neleḍi devasiṁhamā
gajabhajiṁpusu vachchi kāsuga nudiṁcheḍi-
dvijamunisaṁghamula devasiṁhamā

(||dikku||)
muppiridāsulagĕllā muṁdu muṁde yŏsageḍi-
tipparāni varamula devasiṁhamā
sippala nahobalāna śhrīveṁkaḍādrimīm̐da
tĕppala deleḍiyaṭṭi devasiṁhamā