ధర్మముఁ బుణ్యము తనచేతిదే యిఁక
(॥పల్లవి॥)
ధర్మముఁ బుణ్యము తనచేతిదే యిఁక
మర్మములవి తనమనసే యెఱుఁగు
(॥ధర్మ॥)
శిరసునఁ బెట్టిన సేసవలుండఁగా
పరిపరి విధముల బాసలునా
సరిగానేమని జరసే నే నింక
ధర మీఁదిపనులు తానే యెఱుఁగు
(॥ధర్మ॥)
వొడఁబడి యిచ్చిన వుంగరమిదిగో
బెడిదముగా యిఁకఁ బిలుపులునా
బడిబడి నిటు చలపట్టనేల యిఁక
తడవేటిసుద్దులు తానే యెఱుఁగు
(॥ధర్మ॥)
కలసిన కాఁగిటి కందువలున్నవి
పలుమారుఁ బెనఁగు బలములునా
చెలి ననుఁగూడెను శ్రీవేంకటేశుఁడు
తలపించవె యిటు తానేయెఱుఁగు
(||pallavi||)
dharmamum̐ buṇyamu tanasedide yim̐ka
marmamulavi tanamanase yĕṟum̐gu
(||dharma||)
śhirasunam̐ bĕṭṭina sesavaluṁḍam̐gā
paribari vidhamula bāsalunā
sarigānemani jarase ne niṁka
dhara mīm̐dibanulu tāne yĕṟum̐gu
(||dharma||)
vŏḍam̐baḍi yichchina vuṁgaramidigo
bĕḍidamugā yim̐kam̐ bilubulunā
baḍibaḍi niḍu salabaṭṭanela yim̐ka
taḍaveḍisuddulu tāne yĕṟum̐gu
(||dharma||)
kalasina kām̐giḍi kaṁduvalunnavi
palumārum̐ bĕnam̐gu balamulunā
sĕli nanum̐gūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍu
talabiṁchavĕ yiḍu tāneyĕṟum̐gu