Dharalo naagum gottalaa tanasemtalu

ధరలో నాకుఁ గొత్తలా తనచేఁతలు
Language

(॥పల్లవి॥)
ధరలో నాకుఁ గొత్తలా తనచేఁతలు
సిరులతోఁ గాఁపురము సేయుమని యనవే

(॥ధర॥)
కొత్త పెండ్లికూఁతురంటా కోరి నాకేమి చూపీనే
యెత్తి యింటఁ బెట్టుకొనుమనవే తాను
యెత్తి యాపెచక్కఁదనా లీడనేల పొగడీనే
బత్తితోఁ దానె సంతోసపడి వుండుమనవే

(॥ధర॥)
బువ్వమంటా నాపెంగిలిపొత్తుకేల పిలచీనే
రవ్వగాఁ దానారగించి రమ్మనవే
యివ్వల నాపెకులము యింతయేల చెప్పీనే
పవ్వళించి తానే యెంచి పాటముగొమ్మనవే

(॥ధర॥)
చెల్లెలంటా నాకునేల చెప్పి యప్పగించీనే
బల్లిదుఁడు తనాలాయ బదుకుఁ గాక
చెల్లు నలమేల్ మంగను శ్రీవెంకటేశుఁడు తాను
కొల్లగాఁ దన్నునేలెఁ గూడి వుండుమనవే

(||pallavi||)
dharalo nāgum̐ gŏttalā tanasem̐talu
siruladom̐ gām̐puramu seyumani yanave

(||dhara||)
kŏtta pĕṁḍligūm̐turaṁṭā kori nāgemi sūbīne
yĕtti yiṁṭam̐ bĕṭṭugŏnumanave tānu
yĕtti yābĕsakkam̐danā līḍanela pŏgaḍīne
battidom̐ dānĕ saṁtosabaḍi vuṁḍumanave

(||dhara||)
buvvamaṁṭā nābĕṁgilibŏttugela pilasīne
ravvagām̐ dānāragiṁchi rammanave
yivvala nābĕgulamu yiṁtayela sĕppīne
pavvaḽiṁchi tāne yĕṁchi pāḍamugŏmmanave

(||dhara||)
sĕllĕlaṁṭā nāgunela sĕppi yappagiṁchīne
ballidum̐ḍu tanālāya badugum̐ gāga
sĕllu nalamel maṁganu śhrīvĕṁkaḍeśhum̐ḍu tānu
kŏllagām̐ dannunelĕm̐ gūḍi vuṁḍumanave