ధర నెఱఁగవా యీ తగవు జాణఁడవు నీవు
(॥పల్లవి॥)
ధర నెఱఁగవా యీ తగవు జాణఁడవు నీవు
సరసము విరసము సరిపెట్టఁదగునా
(॥ధర॥)
కొసరికొసరి నిన్ను కొఁ(కొం?) గువట్టి తియ్యఁగాను
విసరి పూవులఁగాని వేసేవు
అసురుసురై యట్టె ఆఁటది వలచిరాఁగా
రసికుఁడు మొగవాఁడు రాయిడించఁదగునా
(॥ధర॥)
కలసి మెలసి నేను కందువకుఁ దియ్యఁగాను
వెలుపల నుండి నీవు విఱ్ఱవీఁగేవు
అలరుచు నాఁటది యాసలు పైఁజల్లఁగాను
బలిమిని మొగవాఁడుపంతమాడఁదగునా
(॥ధర॥)
కైవశమై నే నిన్ను కాఁగిటఁ గూడఁగాను
శ్రీవేంకటేశుఁడ నీవు సిగ్గువడేవు
చేవదేర నాఁటది చేరి మోవి ఇయ్యఁగాను
కావరించి మొగవాఁడు గంటి సేయఁదగునా
(||pallavi||)
dhara nĕṟam̐gavā yī tagavu jāṇam̐ḍavu nīvu
sarasamu virasamu saribĕṭṭam̐dagunā
(||dhara||)
kŏsarigŏsari ninnu kŏm̐(kŏṁ?) guvaṭṭi tiyyam̐gānu
visari pūvulam̐gāni vesevu
asurusurai yaṭṭĕ ām̐ṭadi valasirām̐gā
rasigum̐ḍu mŏgavām̐ḍu rāyiḍiṁcham̐dagunā
(||dhara||)
kalasi mĕlasi nenu kaṁduvagum̐ diyyam̐gānu
vĕlubala nuṁḍi nīvu viṭravīm̐gevu
alarusu nām̐ṭadi yāsalu paim̐jallam̐gānu
balimini mŏgavām̐ḍubaṁtamāḍam̐dagunā
(||dhara||)
kaivaśhamai ne ninnu kām̐giḍam̐ gūḍam̐gānu
śhrīveṁkaḍeśhum̐ḍa nīvu sigguvaḍevu
sevadera nām̐ṭadi seri movi iyyam̐gānu
kāvariṁchi mŏgavām̐ḍu gaṁṭi seyam̐dagunā