Dhana memta galiginaa tagu samrakshana lega

ధన మెంత గలిగినా తగు సంరక్షణ లేక
Language

(॥పల్లవి॥)
ధన మెంత గలిగినా తగు సంరక్షణ లేక
కనుఁగొని తనదంటే కైవసము గాదు

(॥ధన॥)
యేరీతి భయభక్తి యెంత గలిగినాను
చేరి ముద్రాధారి గాక సిద్ధింపదు
తేరిపారి తా నెంత పతివ్రత యైనాను
కోరి పుస్తెగట్టకున్న గురుతు గాదు

(॥ధన॥)
యిరవై దేవుఁడు తనయెదుట నెంత యుండినా
గురువనుమతి లేక కొనసాగదు
ధరలోఁ బుట్టినప్పడు తా నెంత బ్రహ్మణుఁడైన
పరగ జంద్యము లేక పాత్రుఁడు గాఁడు

(॥ధన॥)
వావిరిఁ దాఁ గడు వైష్ణవుఁడ ననుకొన్న
దేవతాంతర ముడుగక తిరము గాదు
శ్రీ వేంకటేశ్వర నీ సేవకులైనవారికి
వేవేలు విధులైన వెలితి లేదు

(||pallavi||)
dhana mĕṁta galiginā tagu saṁrakṣhaṇa lega
kanum̐gŏni tanadaṁṭe kaivasamu gādu

(||dhana||)
yerīdi bhayabhakti yĕṁta galiginānu
seri mudrādhāri gāga siddhiṁpadu
teribāri tā nĕṁta padivrada yainānu
kori pustĕgaṭṭagunna gurudu gādu

(||dhana||)
yiravai devum̐ḍu tanayĕduḍa nĕṁta yuṁḍinā
guruvanumadi lega kŏnasāgadu
dharalom̐ buṭṭinappaḍu tā nĕṁta brahmaṇum̐ḍaina
paraga jaṁdyamu lega pātrum̐ḍu gām̐ḍu

(||dhana||)
vāvirim̐ dām̐ gaḍu vaiṣhṇavum̐ḍa nanugŏnna
devadāṁtara muḍugaga tiramu gādu
śhrī veṁkaḍeśhvara nī sevagulainavārigi
vevelu vidhulaina vĕlidi ledu