Dhaaruneebadiginim dalambaalo

ధారుణీపతికినిఁ దలఁబాలో
Language

(॥పల్లవి॥)
ధారుణీపతికినిఁ దలఁబాలో - బహు-
దారారతునకుఁ దలఁబాలో

(॥ధారుణీ॥)
హేమవర్ణునకు నిందిరాపతికి
దామోదరునకుఁ దలఁబాలో
సామజభయరక్షకునకు దులసీ
ధామునకు హరికిఁ దలఁబాలో

(॥ధారుణీ॥)
కలికిరుకిమిణికిఁ గడుఁ దమకించి
తలదైవమునకుఁ దలఁబాలో
మలసి సత్యభామకు బతిపంకజ
దళనేత్రునకునుఁ దలఁబాలో

(॥ధారుణీ॥)
తిరువేంకటమున దినపెండ్లిగల
తరుణులపతికినిఁ దలఁబాలో
యిరవుగ బాయక యిందిర నురమున
ధరియించుహరికిఁ దలఁబాలో

(||pallavi||)
dhāruṇībadiginim̐ dalam̐bālo - bahu-
dārāradunagum̐ dalam̐bālo

(||dhāruṇī||)
hemavarṇunagu niṁdirābadigi
dāmodarunagum̐ dalam̐bālo
sāmajabhayarakṣhagunagu dulasī
dhāmunagu harigim̐ dalam̐bālo

(||dhāruṇī||)
kaligirugimiṇigim̐ gaḍum̐ damagiṁchi
taladaivamunagum̐ dalam̐bālo
malasi satyabhāmagu badibaṁkaja
daḽanetrunagunum̐ dalam̐bālo

(||dhāruṇī||)
tiruveṁkaḍamuna dinabĕṁḍligala
taruṇulabadiginim̐ dalam̐bālo
yiravuga bāyaga yiṁdira nuramuna
dhariyiṁchuharigim̐ dalam̐bālo