Devuni prasaadamu terala lamdugoro

దేవుని ప్రసాదము తెరళ లందుకోరో
Language

(॥పల్లవి॥)
దేవుని ప్రసాదము తెరళ లందుకోరో
యీవేళ నారగించె యీశ్వరేశ్వరుఁడు

(॥దేవుని॥)
వేగు జామునను లేచి వేద విప్ర లెల్లఁ గూడి
ఆగపు ధనుర్మాసమందు పూజించి
రాగమునఁ దేర్పాముడి రంతుసేసి చదువఁగ
జాగుతోడ నారగించె సర్వలోకేశ్వరుఁడు

(॥దేవుని॥)
దిన సంభ్రమములతో దేవదుందుభులు మ్రోయ
తన చెరపులు పై పై దాసులు సేయ
సనకాదు లిరువంక సంకీర్తన వాడఁగా
వినుకొంటా నారగించె విశ్వలోకేశ్వరుఁడు

(॥దేవుని॥)
హత్తుకొని వైష్ణువులు అనుష్ఠానములు దీర్చి
యెత్తిచేతుల పుష్పాంజ లియ్యఁగాను
పొత్తుల నలమేలుమంగ బోనము దొడుకఁగాను
చిత్తగించి ఆరగించె శ్రీ వేంకటేశ్వరుఁడూ

(||pallavi||)
devuni prasādamu tĕraḽa laṁdugoro
yīveḽa nāragiṁchĕ yīśhvareśhvarum̐ḍu

(||devuni||)
vegu jāmunanu lesi veda vipra lĕllam̐ gūḍi
āgabu dhanurmāsamaṁdu pūjiṁchi
rāgamunam̐ derbāmuḍi raṁtusesi saduvam̐ga
jāgudoḍa nāragiṁchĕ sarvalogeśhvarum̐ḍu

(||devuni||)
dina saṁbhramamulado devaduṁdubhulu mroya
tana sĕrabulu pai pai dāsulu seya
sanagādu liruvaṁka saṁkīrdana vāḍam̐gā
vinugŏṁṭā nāragiṁchĕ viśhvalogeśhvarum̐ḍu

(||devuni||)
hattugŏni vaiṣhṇuvulu anuṣhṭhānamulu dīrsi
yĕttisedula puṣhpāṁja liyyam̐gānu
pŏttula nalamelumaṁga bonamu dŏḍugam̐gānu
sittagiṁchi āragiṁchĕ śhrī veṁkaḍeśhvarum̐ḍū