Devumdu galamdugaa deenigemi

దేవుఁడు గలఁడుగా దీనికేమి
Language

(॥పల్లవి॥)
దేవుఁడు గలఁడుగా దీనికేమి
కైవసమయ్యేరుగాక కానీ కానీ

(॥దేవు॥)
పంచేంద్రియములాల పాపపుణ్యకర్మమా
చంచల చిత్తమా అరిషడ్వర్గమా
యించుకంత జీవుఁడింతై యిందరు దొమ్మిసేసి
పంచుకొంటి రింతట మీ పంత మెక్కెనా

(॥దేవు॥)
యిలఁ దాపత్రయమా యీషణత్రములాల
బలుసంసారమ అనుబంధములాల
కలిగిన దేహ మిదె కాణాచి మీ రందరు
నెలకొంటి రిందేమీ తనివిఁ బొందెనా

(॥దేవు॥)
సకలతత్వములాల జన్మకోట్లాలవో
ప్రకటపు నిజమాయ భాగ్యఫలమా
వొకట శ్రీవేంకటేశు నొద్దికిఁ దీసితిరిమీ
రకలంకమైన మీ కృతము చెల్లెనా

(||pallavi||)
devum̐ḍu galam̐ḍugā dīnigemi
kaivasamayyerugāga kānī kānī

(||devu||)
paṁcheṁdriyamulāla pābabuṇyagarmamā
saṁchala sittamā ariṣhaḍvargamā
yiṁchugaṁta jīvum̐ḍiṁtai yiṁdaru dŏmmisesi
paṁchugŏṁṭi riṁtaḍa mī paṁta mĕkkĕnā

(||devu||)
yilam̐ dābatrayamā yīṣhaṇatramulāla
balusaṁsārama anubaṁdhamulāla
kaligina deha midĕ kāṇāsi mī raṁdaru
nĕlagŏṁṭi riṁdemī tanivim̐ bŏṁdĕnā

(||devu||)
sagaladatvamulāla janmagoṭlālavo
pragaḍabu nijamāya bhāgyaphalamā
vŏgaḍa śhrīveṁkaḍeśhu nŏddigim̐ dīsidirimī
ragalaṁkamaina mī kṛtamu sĕllĕnā