దేవుఁడు దేవియు వారే తెరవేసితిమి మన
(॥పల్లవి॥)
దేవుఁడు దేవియు వారే తెరవేసితిమి మన-
మీవల నుందము మరి యేమీ ననవలదు
(॥దేవు॥)
మంతనములే సుమ్మీ మనసులలోపలి-
వింతలైనసిగ్గులెల్ల విడిపించేవి
దొంతులైన కోరికలే తోడఁదోడఁ దిరిగాడి
సంతతపువెఱపుల చలివాపేవి
(॥దేవు॥)
పాయపుమదాలే సుమ్మీ పలుకులు వొనగూర్చి
బాయిటనుండే వొడఁబాటు సేసేవి
చాయలసరసములే నందులు గొందులు దూరి
కాయము కాయము నంటఁ గాఁగిలింపించేవి
(॥దేవు॥)
చూపులుఁ జూపులే సుమ్మీ సూడువట్టి మర్మములు
రాపులఁ దలచిఁనట్టు రతులిచ్చేవి
యేపుల శ్రీవేంకటేశుఁ డీకెయుఁ గూడి రిద్దరు
దాపులైనవలపులే తమిరేఁచేవి
(||pallavi||)
devum̐ḍu deviyu vāre tĕravesidimi mana-
mīvala nuṁdamu mari yemī nanavaladu
(||devu||)
maṁtanamule summī manasulalobali-
viṁtalainasiggulĕlla viḍibiṁchevi
dŏṁtulaina korigale toḍam̐doḍam̐ dirigāḍi
saṁtadabuvĕṟabula salivābevi
(||devu||)
pāyabumadāle summī palugulu vŏnagūrsi
bāyiḍanuṁḍe vŏḍam̐bāḍu sesevi
sāyalasarasamule naṁdulu gŏṁdulu dūri
kāyamu kāyamu naṁṭam̐ gām̐giliṁpiṁchevi
(||devu||)
sūbulum̐ jūbule summī sūḍuvaṭṭi marmamulu
rābulam̐ dalasim̐naṭṭu radulichchevi
yebula śhrīveṁkaḍeśhum̐ ḍīgĕyum̐ gūḍi riddaru
dābulainavalabule tamirem̐sevi