Devumdokkamde guri delisinavaarigi

దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి
Language

(॥పల్లవి॥)
దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి
యీవలావల చూచినా నిఁకలేదు తెఱఁగు

(॥దేవుఁ॥)
కోపము మానితేనే కోటిజపాలు సేయుట
పాపము సేయకుంటేనే బలుతపము
లోపల తానూరకుంటే లోకమెల్లాఁ జరించుట
మాపుదాఁకా వెదకినా మఱిలేదు తెఱఁగు

(॥దేవుఁ॥)
పరకాంత నంటకుంటె బలుపుణ్యాలు సేయుట
సొరిది నాసమానుటే సోమపానము
సరిమోనాన నుండుటే సన్యాసము చేకొనుట
యిరవైతే నంతకంటే నిఁకలేదు తెఱఁగు

(॥దేవుఁ॥)
పలు సుఖదుఃఖములఁ బాసి వుండుటే మోక్షము
అల చంచలము మానుటది యోగము
యిలపై శ్రీవేంకటేశుఁ డిచ్చిన సుజ్ఞానమిది
యెలమి బుద్ధిఁ బోల నిఁకలేదు తెఱఁగు

(||pallavi||)
devum̐ḍŏkkam̐ḍe guri dĕlisinavārigi
yīvalāvala sūsinā nim̐kaledu tĕṟam̐gu

(||devum̐||)
kobamu mānidene koḍijabālu seyuḍa
pābamu seyaguṁṭene baludabamu
lobala tānūraguṁṭe logamĕllām̐ jariṁchuḍa
mābudām̐kā vĕdaginā maṟiledu tĕṟam̐gu

(||devum̐||)
paragāṁta naṁṭaguṁṭĕ balubuṇyālu seyuḍa
sŏridi nāsamānuḍe somabānamu
sarimonāna nuṁḍuḍe sanyāsamu segŏnuḍa
yiravaide naṁtagaṁṭe nim̐kaledu tĕṟam̐gu

(||devum̐||)
palu sukhaduḥkhamulam̐ bāsi vuṁḍuḍe mokṣhamu
ala saṁchalamu mānuḍadi yogamu
yilabai śhrīveṁkaḍeśhum̐ ḍichchina sujñānamidi
yĕlami buddhim̐ bola nim̐kaledu tĕṟam̐gu