Devumdavugaa aabe devulu neegainaam gaani

దేవుఁడవుగా ఆపె దేవులు నీకైనాఁ గాని
Language

(॥పల్లవి॥)
దేవుఁడవుగా ఆపె దేవులు నీకైనాఁ గాని
చేవదేరిన బుద్దులు చెప్పితి మోయయ్యా

(॥దేవు॥)
కాంత గోపించి చూచితే కామునియమ్ములై తాఁకు
సంతసించి చూచితేనే చకోరాలౌను
శాంతుఁడవు నీవెట్టు సాము సేసే వీపెతోడ
పంతము లాడక కిందుపడి వుండవయ్యా

(॥దేవు॥)
చెలి నిన్నుఁ దిట్టితేనే చిరు చెండులై తోఁచుఁ
నిల నిన్నుఁ బొగడితే నివె తేనెలౌ
చలపట్టి నీవెట్టు సరిదూఁగే వాపెతోడ
యెలమి యేప్రొద్దు నీవు ఇచ్చలాడవయ్యా

(॥దేవు॥)
వనితకాఁగిలి నీకు వలపులవలలౌను
తనిసి చేపట్టితేనే తమ్మి పూజలౌ
యెనసి శ్రీవేంకటేశ యాపెతో నెట్టు మీ రేవు
మొనసి కూడితి విట్టె మొక్కు మొక్కవయ్యా

(||pallavi||)
devum̐ḍavugā ābĕ devulu nīgainām̐ gāni
sevaderina buddulu sĕppidi moyayyā

(||devu||)
kāṁta gobiṁchi sūside kāmuniyammulai tām̐ku
saṁtasiṁchi sūsidene sagorālaunu
śhāṁtum̐ḍavu nīvĕṭṭu sāmu sese vībĕdoḍa
paṁtamu lāḍaga kiṁdubaḍi vuṁḍavayyā

(||devu||)
sĕli ninnum̐ diṭṭidene siru sĕṁḍulai tom̐sum̐
nila ninnum̐ bŏgaḍide nivĕ tenĕlau
salabaṭṭi nīvĕṭṭu saridūm̐ge vābĕdoḍa
yĕlami yeprŏddu nīvu ichchalāḍavayyā

(||devu||)
vanidagām̐gili nīgu valabulavalalaunu
tanisi sebaṭṭidene tammi pūjalau
yĕnasi śhrīveṁkaḍeśha yābĕdo nĕṭṭu mī revu
mŏnasi kūḍidi viṭṭĕ mŏkku mŏkkavayyā