Devumdavu neevu needevulamma bhaagya mimte

దేవుఁడవు నీవు నీదేవులమ్మ భాగ్య మింతే
Language

(॥పల్లవి॥)
దేవుఁడవు నీవు నీదేవులమ్మ భాగ్య మింతే
చేవదేరెఁ బనులెల్లా చిత్త మెట్లున్నదో

(॥దేవు॥)
విన్నపాల కెడలేదు వేగిరించఁ బొద్దులేదు
అన్నిటా నింతి కేమని యానతిచ్చేవో
సన్న సేయఁ బనిలేదు సాదించఁ దరిగాదు
యెన్నినకోరికలెల్ల నెట్టు సేసేవో

(॥దేవు॥)
నవ్వఁగ నోపికలేదు నాయములుఁజవిగావు
చివ్వన నీబాస లెట్టు చెల్లించేవో
రవ్వసేయఁజోటులేదు రాజసాన కిమ్ములేదు
పువ్వువంటిచెలి నెట్టు బుజ్జగించేవో

(॥దేవు॥)
నిక్కి చూడ నంకెగాదు నెలఁతకు నీకుఁబోదు
మక్కువ నెట్లా నీవు మన్నించేవో
వొక్కటై శ్రీవేంకటేశ వువిదఁ గూడితి విట్టె
యిక్కువఁ గెమ్మోవి యాని యేవగఁ జొక్కేవో

(||pallavi||)
devum̐ḍavu nīvu nīdevulamma bhāgya miṁte
sevaderĕm̐ banulĕllā sitta mĕṭlunnado

(||devu||)
vinnabāla kĕḍaledu vegiriṁcham̐ bŏdduledu
anniḍā niṁti kemani yānadichchevo
sanna seyam̐ baniledu sādiṁcham̐ darigādu
yĕnninagorigalĕlla nĕṭṭu sesevo

(||devu||)
navvam̐ga nobigaledu nāyamulum̐javigāvu
sivvana nībāsa lĕṭṭu sĕlliṁchevo
ravvaseyam̐joḍuledu rājasāna kimmuledu
puvvuvaṁṭisĕli nĕṭṭu bujjagiṁchevo

(||devu||)
nikki sūḍa naṁkĕgādu nĕlam̐tagu nīgum̐bodu
makkuva nĕṭlā nīvu manniṁchevo
vŏkkaḍai śhrīveṁkaḍeśha vuvidam̐ gūḍidi viṭṭĕ
yikkuvam̐ gĕmmovi yāni yevagam̐ jŏkkevo