(॥పల్లవి॥)
దేవుఁడవు నీవూ దేవుల నేను
వావులు గూడఁగాను వడి సేసవెట్టితి
(॥దేవుఁ॥)
వలపులు నే నెఱఁగ వాసు లెఱఁడను; నీవు
కలకల నవ్వితేనే కరఁగితిని
పలుకులు నే నేర భావించఁగ నే నేర
పిలిచి విడెమిచ్చితే ప్రియమందితిని
(॥దేవుఁ॥)
మనసు సాదించనోప మర్మము లడుగనోప
చెనకి గోర నూఁదితే చేకొంటిని
పెనఁగఁజాలను నేను బిగియఁగఁజాలను
కనువిచ్చి చూచితేనే కానిమ్మంటిని
(॥దేవుఁ॥)
పచ్చిచేఁతలు రచించఁ బలుమారు సిగ్గువడ
మచ్చికఁ గాఁగిలించితే మరిగితిని
యిచ్చట శ్రీవేంకటేశ యేలుకొంటి విటు నన్ను
మెచ్చి కాఁగిలించితేను మేకొని మొక్కితివి
(||pallavi||)
devum̐ḍavu nīvū devula nenu
vāvulu gūḍam̐gānu vaḍi sesavĕṭṭidi
(||devum̐||)
valabulu ne nĕṟam̐ga vāsu lĕṟam̐ḍanu; nīvu
kalagala navvidene karam̐gidini
palugulu ne nera bhāviṁcham̐ga ne nera
pilisi viḍĕmichchide priyamaṁdidini
(||devum̐||)
manasu sādiṁchanoba marmamu laḍuganoba
sĕnagi gora nūm̐dide segŏṁṭini
pĕnam̐gam̐jālanu nenu bigiyam̐gam̐jālanu
kanuvichchi sūsidene kānimmaṁṭini
(||devum̐||)
pachchisem̐talu rasiṁcham̐ balumāru sigguvaḍa
machchigam̐ gām̐giliṁchide marigidini
yichchaḍa śhrīveṁkaḍeśha yelugŏṁṭi viḍu nannu
mĕchchi kām̐giliṁchidenu megŏni mŏkkidivi