దేవుఁడట యీతఁడు దేవులట మహాలక్ష్మి
(॥పల్లవి॥)
దేవుఁడట యీతఁడు దేవులట మహాలక్ష్మి
దేవుని దేవిని నగి తెగడరో హరిని
(॥దేవు॥)
రోలఁ గట్టువడె నని రోకలి చేఁ బట్టె నని
రోలా రోఁకటఁ బాడరోఁ హరిని
కాల బండి దన్నె నని కైకొనె మానము లని
కాలనే మానమున కాడఁ గదరో హరికి
(॥దేవు॥)
సుద్దులే దొంగరికాలు మద్దులు విఱచినాఁడు
సుద్దులు మద్దులుఁ జెప్పి చూపరో హరిని
చద్దులు చిక్కానఁ గట్టే చాలఁ జిచ్చువేఁడి మింగె
చద్దికి వేఁడికి మీరు సతులెల్ల నగరో
(॥దేవు॥)
చేతనే చీరలు దీసె వాతఁ బిల్లఁ గోలు వూదె
చేత వాత బ్రియములు చెప్పరో హరికి
యేతుల శ్రీవేంకటాద్రికృష్ణుడు మనలఁ గూడె
యీతల నాతలఁ బంత మియ్యరో హరికి
(||pallavi||)
devum̐ḍaḍa yīdam̐ḍu devulaḍa mahālakṣhmi
devuni devini nagi tĕgaḍaro harini
(||devu||)
rolam̐ gaṭṭuvaḍĕ nani rogali sem̐ baṭṭĕ nani
rolā rom̐kaḍam̐ bāḍarom̐ harini
kāla baṁḍi dannĕ nani kaigŏnĕ mānamu lani
kālane mānamuna kāḍam̐ gadaro harigi
(||devu||)
suddule dŏṁgarigālu maddulu viṟasinām̐ḍu
suddulu maddulum̐ jĕppi sūbaro harini
saddulu sikkānam̐ gaṭṭe sālam̐ jichchuvem̐ḍi miṁgĕ
saddigi vem̐ḍigi mīru sadulĕlla nagaro
(||devu||)
sedane sīralu dīsĕ vādam̐ billam̐ golu vūdĕ
seda vāda briyamulu sĕpparo harigi
yedula śhrīveṁkaḍādrikṛṣhṇuḍu manalam̐ gūḍĕ
yīdala nādalam̐ baṁta miyyaro harigi