Devum dokkamde maṟi jeevulu veru

దేవుఁ డొక్కఁడే మఱి జీవులు వేరు
Language

(॥పల్లవి॥)
దేవుఁ డొక్కఁడే మఱి జీవులు వేరు
వావాతఁ దెలిసేది వారి వారి భాగ్యము

(॥దేవు॥)
పొడమినవారికిఁ బోయినవారికి
గడియ లొక్కటే వారి గతులు వేరు
బడిఁ బుణ్యములు సేయఁ బాపములు సేయఁగ
కడఁగి కాల మొక్కటే కర్మములే వేరు

(॥దేవు॥)
కాకములు సంచరించె కలహంసలు దిరిగె
ఆకాశ మొక్కటే విహారాలు వేరు
మేకొని యెండలు గాయ మించి చీఁకటులు రాయ
లోకపు బయ లొక్కటే జోకలే వేరు

(॥దేవు॥)
అట్టే యేలే రాజులకు నడిగేటి దీనులకు
పట్టి భూమి యొక్కటే బాగులు వేరు
గుట్టున శ్రీవేంకటేశుఁ గొలువఁగఁ దలఁచఁగ
నెట్టన దేహ మొక్కటే నేరుపులే వేరు

(||pallavi||)
devum̐ ḍŏkkam̐ḍe maṟi jīvulu veru
vāvādam̐ dĕlisedi vāri vāri bhāgyamu

(||devu||)
pŏḍaminavārigim̐ boyinavārigi
gaḍiya lŏkkaḍe vāri gadulu veru
baḍim̐ buṇyamulu seyam̐ bābamulu seyam̐ga
kaḍam̐gi kāla mŏkkaḍe karmamule veru

(||devu||)
kāgamulu saṁchariṁchĕ kalahaṁsalu dirigĕ
āgāśha mŏkkaḍe vihārālu veru
megŏni yĕṁḍalu gāya miṁchi sīm̐kaḍulu rāya
logabu baya lŏkkaḍe jogale veru

(||devu||)
aṭṭe yele rājulagu naḍigeḍi dīnulagu
paṭṭi bhūmi yŏkkaḍe bāgulu veru
guṭṭuna śhrīveṁkaḍeśhum̐ gŏluvam̐gam̐ dalam̐sam̐ga
nĕṭṭana deha mŏkkaḍe nerubule veru