దేవులనయ్యేనంటా తివిరీఁ దాను
(॥పల్లవి॥)
దేవులనయ్యేనంటా తివిరీఁ దాను
చేవదేర నాపెఁ గొంత చేపట్టఁగరాదా
(॥దేవు॥)
చుట్టమనై నీతోను సుద్దులెల్లాఁ జెప్పఁగాను
వెట్టికి వచ్చి తానేల వెంగెమాడీని
గట్టిగా నాపెకు విది కడువేడుకైతేను
అట్టె కడమమాటెల్లా నడుగఁగరాదా
(॥దేవు॥)
బత్తిచేసి నే నీకు పాదాలు పిసుకఁగ
తత్తరించి తానేల తప్పువట్టీని
హత్తి తనకు నేరుపు లంతేసి కలిగితేను
కొత్తలవెట్టో తెలుసుకొని చూడరాదా
(॥దేవు॥)
అలమేలుమంగనై నిన్నటు గాగిలించుకోగా
యెలమిఁ దానేల వచ్చి యేఁకారీని
అలరి శ్రీవేంకటేశ ఆస లాపెకుఁ గల్గితే
పిలిచి యందూఁ గొంత పెనఁగించరాదా
(||pallavi||)
devulanayyenaṁṭā tivirīm̐ dānu
sevadera nābĕm̐ gŏṁta sebaṭṭam̐garādā
(||devu||)
suṭṭamanai nīdonu suddulĕllām̐ jĕppam̐gānu
vĕṭṭigi vachchi tānela vĕṁgĕmāḍīni
gaṭṭigā nābĕgu vidi kaḍuveḍugaidenu
aṭṭĕ kaḍamamāḍĕllā naḍugam̐garādā
(||devu||)
battisesi ne nīgu pādālu pisugam̐ga
tattariṁchi tānela tappuvaṭṭīni
hatti tanagu nerubu laṁtesi kaligidenu
kŏttalavĕṭṭo tĕlusugŏni sūḍarādā
(||devu||)
alamelumaṁganai ninnaḍu gāgiliṁchugogā
yĕlamim̐ dānela vachchi yem̐kārīni
alari śhrīveṁkaḍeśha āsa lābĕgum̐ galgide
pilisi yaṁdūm̐ gŏṁta pĕnam̐giṁcharādā