దేవశిఖామణి కామధేను వేకబల నీకు
(॥పల్లవి॥)
దేవశిఖామణి కామధేను వేకబల నీకు
వేవేగ సంధ్యాదివిధుల వేళాయె లేవే
(॥దేవ॥)
మంచి జలధులే మొగమజ్జనీమున కాయితమా
కాంచనపు మేరవే గదెపీఁట
అంచ తుంబురు నారదు లదె మంగళపాటకులు
వుంచానఁ బాడేరు సూర్యుఁ డుదయంచె లేవే
(॥దేవ॥)
వుదయరాగపు మేఘ మొగిఁ గుంకుమగంనము
చదలపైఁడి మణుఁగు జాంబూనది
అదన కాంతల చూపు లనిగొ మంత్రాక్షతలు
యెదురు చల్లేరు పొద్దెక్కినదె లేవే
(॥దేవ॥)
కల్పవృషపుటాకులు కాయటా మంచి విడాలూ
కల్పించే పారిజాతమె కమ్మఁబూవులు
పొల్పఁగ శ్రీ వేంకటాద్రి పురుషోత్తముఁడ భోగి
తల్ప కొలువువేళాయెఁ దగ లేవయ్యా
(||pallavi||)
devaśhikhāmaṇi kāmadhenu vegabala nīgu
vevega saṁdhyādividhula veḽāyĕ leve
(||deva||)
maṁchi jaladhule mŏgamajjanīmuna kāyidamā
kāṁchanabu merave gadĕbīm̐ṭa
aṁcha tuṁburu nāradu ladĕ maṁgaḽabāḍagulu
vuṁchānam̐ bāḍeru sūryum̐ ḍudayaṁchĕ leve
(||deva||)
vudayarāgabu megha mŏgim̐ guṁkumagaṁnamu
sadalabaim̐ḍi maṇum̐gu jāṁbūnadi
adana kāṁtala sūbu lanigŏ maṁtrākṣhadalu
yĕduru salleru pŏddĕkkinadĕ leve
(||deva||)
kalbavṛṣhabuḍāgulu kāyaḍā maṁchi viḍālū
kalbiṁche pārijādamĕ kammam̐būvulu
pŏlbam̐ga śhrī veṁkaḍādri puruṣhottamum̐ḍa bhogi
talba kŏluvuveḽāyĕm̐ daga levayyā