Devashikhaamani divijulu vogadamga

దేవశిఖామణి దివిజులు వొగడఁగ
Language

(॥పల్లవి॥)
దేవశిఖామణి దివిజులు వొగడఁగ
వేవేలు గతులు వెలసీ వాఁడే

(॥దేవ॥)
వీదుల వీదుల వెసఁ దురగముపై
భేదిల బల్లెము బిరబిరఁ దిప్పుచు
మోదముతోడుత మోహనమూరితి
యే దెసచూచిన నేఁగీ వాఁడే

(॥దేవ॥)
కన్నులు దిప్పుచు కర్ణములు గదల
సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటఁ దేజి యాడఁగ దేవుఁడు
తిన్నఁగ వాగేలు దిప్పీ వాఁడే

(॥దేవ॥)
వలగొనఁ దిరుగుచు వాలము విసరుచు
నిలిచి గుఱ్ఱ మటు నేర్పులు చూపఁగ
బలుశ్రీవేంకటపతి యహోబలపుఁ
బొలమున సారెకుఁ బొదలీ వాఁడే

(||pallavi||)
devaśhikhāmaṇi divijulu vŏgaḍam̐ga
vevelu gadulu vĕlasī vām̐ḍe

(||deva||)
vīdula vīdula vĕsam̐ duragamubai
bhedila ballĕmu birabiram̐ dippusu
modamudoḍuda mohanamūridi
ye dĕsasūsina nem̐gī vām̐ḍe

(||deva||)
kannulu dippusu karṇamulu gadala
sannala rāgĕgu saugaḽiṁpusunu
anniḍam̐ deji yāḍam̐ga devum̐ḍu
tinnam̐ga vāgelu dippī vām̐ḍe

(||deva||)
valagŏnam̐ dirugusu vālamu visarusu
nilisi guṭra maḍu nerbulu sūbam̐ga
baluśhrīveṁkaḍabadi yahobalabum̐
bŏlamuna sārĕgum̐ bŏdalī vām̐ḍe