(॥పల్లవి॥)
దేవరవు నీవు నీదేవుల నేను
వావి గద్దు గనక నీవద్దనే వుండుదును
(॥దేవర॥)
వేసరకుమీ నా వీరిడి మాటలకును
ఆసపడి యేమైనా నాడుదు నేను
వాసులెంచకుమీ నా వలపుల నవ్వులందు
రాసికెక్కనట్టే సరసములాడుదును
(॥దేవర॥)
తప్పులు వట్టికుమీ నా తమకపు చేఁతలకు
కొప్పు వట్టి తీసి నిన్నుఁ గొసరుదును
వుప్పటించకుమీ నా వుదుటుఁజూపులకు
చిప్పిల మర్మాలు నాఁటఁ జిమ్ముదు నేను
(॥దేవర॥)
గొరబు సేయకుమీ కూటపు నా రతులకు
అరుదులుగాఁ గూడి యలయింతును
యిరవై శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
మరిగితి నీకు నేను మఱవకు నన్నును
(||pallavi||)
devaravu nīvu nīdevula nenu
vāvi gaddu ganaga nīvaddane vuṁḍudunu
(||devara||)
vesaragumī nā vīriḍi māḍalagunu
āsabaḍi yemainā nāḍudu nenu
vāsulĕṁchagumī nā valabula navvulaṁdu
rāsigĕkkanaṭṭe sarasamulāḍudunu
(||devara||)
tappulu vaṭṭigumī nā tamagabu sem̐talagu
kŏppu vaṭṭi tīsi ninnum̐ gŏsarudunu
vuppaḍiṁchagumī nā vuduḍum̐jūbulagu
sippila marmālu nām̐ṭam̐ jimmudu nenu
(||devara||)
gŏrabu seyagumī kūḍabu nā radulagu
arudulugām̐ gūḍi yalayiṁtunu
yiravai śhrīveṁkaḍeśha yinniḍā nannelidivi
marigidi nīgu nenu maṟavagu nannunu