దేవరవు నీవు గావా తెలిపి చెప్పఁగనేల
(॥పల్లవి॥)
దేవరవు నీవు గావా తెలిపి చెప్పఁగనేల
ఆ విద్యలు నీకే చెల్లు ననుకో నేమిటికి
(॥॥)
వింతలు నన్నడిగేవు విచారాలు సేసేవు
యింతి నీకుఁ జెప్పదా యేకతానను
పంతపు నీచేఁతలను పరులాడే మాటలూ నీ
యంతరంగ మెఱఁగదా అనుకో నేమిటికి
(॥॥)
సొమ్ములు వెట్టుమనేవు సోదించేవు మామనసు
కొమ్మ నీకుఁ జూపదా గురుతులెల్లా
దిమ్ముల నీవలపులు దిష్టపు నీమచ్చములు
అమ్మరో నీవు సేయవా అనుకో నేమిటికీ
(॥॥)
వలపు మాపైఁ జల్లేవు వద్దనే మమ్ముఁ బాయవు
అలమేలుమంగ గాదా అరత నీకు
చెలఁగి శ్రీవేంకటేశ చెలుములు బలుములు
అల నీవిద్యలు గావా అనుకో నేమిటికి
(||pallavi||)
devaravu nīvu gāvā tĕlibi sĕppam̐ganela
ā vidyalu nīge sĕllu nanugo nemiḍigi
(||||)
viṁtalu nannaḍigevu visārālu sesevu
yiṁti nīgum̐ jĕppadā yegadānanu
paṁtabu nīsem̐talanu parulāḍe māḍalū nī
yaṁtaraṁga mĕṟam̐gadā anugo nemiḍigi
(||||)
sŏmmulu vĕṭṭumanevu sodiṁchevu māmanasu
kŏmma nīgum̐ jūbadā gurudulĕllā
dimmula nīvalabulu diṣhṭabu nīmachchamulu
ammaro nīvu seyavā anugo nemiḍigī
(||||)
valabu mābaim̐ jallevu vaddane mammum̐ bāyavu
alamelumaṁga gādā arada nīgu
sĕlam̐gi śhrīveṁkaḍeśha sĕlumulu balumulu
ala nīvidyalu gāvā anugo nemiḍigi