దేవరవు నీ సుద్దులు తెలియనివా నేము
(॥పల్లవి॥)
దేవరవు నీ సుద్దులు తెలియనివా నేము
చేవలెక్కించితి వింత చిగురుఁబోండ్లకు
(॥॥)
వువిదకు నీవిచ్చిన వుపదేశమే కాదా
సవతుల నందరిని సాదించుమని
యివల మామోము చూచి యేమి నవ్వే వప్పటిని
జవదాఁటునా ఆఁటది సలిగె లేకున్నను
(॥॥)
మగువకుఁ జెవిలోన మంతిరించినవే కావా
పగటున నందరినిఁ బరచుమని
అగడుగ మాపై నేల ఆనలు వెట్టుకొనేవు
తగవు దప్పునా యింతి దాపు లేకుండినను
(॥॥)
నెలఁతకు నేరిపిన నీతంత్రమే కాదా
నెలకొని పంతములు నెఱపుమని
కలసి శ్రీవేంకటేశ కడు నన్నే మెచ్చేవు
చలపట్టునా యీపె నీసమ్మతి లేకున్నను
(||pallavi||)
devaravu nī suddulu tĕliyanivā nemu
sevalĕkkiṁchidi viṁta sigurum̐boṁḍlagu
(||||)
vuvidagu nīvichchina vubadeśhame kādā
savadula naṁdarini sādiṁchumani
yivala māmomu sūsi yemi navve vappaḍini
javadām̐ṭunā ām̐ṭadi saligĕ legunnanu
(||||)
maguvagum̐ jĕvilona maṁtiriṁchinave kāvā
pagaḍuna naṁdarinim̐ barasumani
agaḍuga mābai nela ānalu vĕṭṭugŏnevu
tagavu dappunā yiṁti dābu leguṁḍinanu
(||||)
nĕlam̐tagu neribina nīdaṁtrame kādā
nĕlagŏni paṁtamulu nĕṟabumani
kalasi śhrīveṁkaḍeśha kaḍu nanne mĕchchevu
salabaṭṭunā yībĕ nīsammadi legunnanu