(॥పల్లవి॥)
దేవరవు గావా యీ తెఱగులకు
చేవదేరె నిఁక రట్టు సేయగవలెనా
(॥॥)
అఱిముఱి నూడిగాలు ఆపెచేత జేయించేవు
యెఱఁగనా నీజాడ లెప్పుడు నేను
మఱి నీవు దొరవౌదు మనసున మెచ్చితివి
గుఱుతులు నాకిన్నిటాఁ గొచ్చి చూపవలెనా
(॥॥)
కానుకగా నాపెసొమ్ము గక్కన నాకిచ్చేవు
కాననా నీ సేఁతలు కలకాలము
పూని నిజమరి వౌదు పొంచి నిన్ను నమ్మితిమి
తానకమై ఆ సుద్దులె తలపెట్టవలెనా
(॥॥)
అలమి నన్నుఁ గూడి ఆపెపేరఁ బిలిచేవు
తెలియనా నీగుట్టు తెల్లమిగాను
యిల జాణఁడ వౌదువు యిన్నిటాఁ దనిసితిమి
యెలమి శ్రీవేంకటేశ యెచ్చరించవలెనా
(||pallavi||)
devaravu gāvā yī tĕṟagulagu
sevaderĕ nim̐ka raṭṭu seyagavalĕnā
(||||)
aṟimuṟi nūḍigālu ābĕseda jeyiṁchevu
yĕṟam̐ganā nījāḍa lĕppuḍu nenu
maṟi nīvu dŏravaudu manasuna mĕchchidivi
guṟudulu nāginniḍām̐ gŏchchi sūbavalĕnā
(||||)
kānugagā nābĕsŏmmu gakkana nāgichchevu
kānanā nī sem̐talu kalagālamu
pūni nijamari vaudu pŏṁchi ninnu nammidimi
tānagamai ā suddulĕ talabĕṭṭavalĕnā
(||||)
alami nannum̐ gūḍi ābĕberam̐ bilisevu
tĕliyanā nīguṭṭu tĕllamigānu
yila jāṇam̐ḍa vauduvu yinniḍām̐ danisidimi
yĕlami śhrīveṁkaḍeśha yĕchchariṁchavalĕnā