Devaravu gaavaa telisidi mallanaamde

దేవరవు గావా తెలిసితి మల్లనాఁడె
Language

(॥పల్లవి॥)
దేవరవు గావా తెలిసితి మల్లనాఁడె
చేవదేరిన పనులు చెప్పనేల యిఁకను

(॥॥)
జఱసి జఱసి నీ యాచారము లేమి చెప్పేవు
యెఱఁగనా నీ సరిత లింతక తొల్లి
యెఱుకలు సేసి నివు యెచ్చరించ నిపుడేల
మఱచేవా నీకతలు మాటికి మాటికిని

(॥॥)
వెంటనే పొగడుకొని విఱ్ఱవీఁగే వెంతేసి
కంటిగా నీ గుణములు గరగరగా
పెంటలుగాఁ బచారించి పెనఁగులాడఁగనేల
జంటగాక విడిచేవా చలముతో నీవు

(॥॥)
పుక్కిటివిడె మిచ్చి పొంచి వొడఁబరచేవు
దక్కెఁగా నీకాఁగిలి తతితోడను
గక్కన శ్రీ వెంకటేశ కలసితి విదె నన్ను
తక్కువయినవా నీ తగిన మన్ననలు

(||pallavi||)
devaravu gāvā tĕlisidi mallanām̐ḍĕ
sevaderina panulu sĕppanela yim̐kanu

(||||)
jaṟasi jaṟasi nī yāsāramu lemi sĕppevu
yĕṟam̐ganā nī sarida liṁtaga tŏlli
yĕṟugalu sesi nivu yĕchchariṁcha nibuḍela
maṟasevā nīgadalu māḍigi māḍigini

(||||)
vĕṁṭane pŏgaḍugŏni viṭravīm̐ge vĕṁtesi
kaṁṭigā nī guṇamulu garagaragā
pĕṁṭalugām̐ basāriṁchi pĕnam̐gulāḍam̐ganela
jaṁṭagāga viḍisevā salamudo nīvu

(||||)
pukkiḍiviḍĕ michchi pŏṁchi vŏḍam̐barasevu
dakkĕm̐gā nīgām̐gili tadidoḍanu
gakkana śhrī vĕṁkaḍeśha kalasidi vidĕ nannu
takkuvayinavā nī tagina mannanalu