Devaravu gaavaa neevu temali yee panulagu

దేవరవు గావా నీవు తెమలి యీ పనులకు
Language

(॥పల్లవి॥)
దేవరవు గావా నీవు తెమలి యీ పనులకు
కావరపు వనితలు కదిసితేఁ జాలును

(॥దేవ॥)
చెక్కులఁ గళలు మించె చేతులఁ జెమట నిండె
చొక్కపుఁజూపుల నాపె చూచితే నీకు
నిక్కెఁ బులకలు మేన నిద్దుర జారెఁ గన్నుల
జక్కన నాపె నీకుఁ బాదా లొత్తితేను

(॥దేవ॥)
సెలవుల నవ్వు వచ్చెఁ జెంగలించె మోమెల్లా
సొలపుమాటల నాపె సోఁకనాడితే
నిలువెల్లా ముదమందె నెగడెఁ గోరిక మది
చలి వాయ మోవి యాపె చవిచూపఁగాను

(॥దేవ॥)
చేరె నీకుఁ దమకము సిగ్గులు లోలో నణఁగె
కూరిమి నాపె నిన్నుఁ గూడఁగాను
యీరితి శ్రీవేంకటేశ ఇంపులాయ రతులెల్లా
గారవించి యాపె నిన్నుఁ గైకొనఁగాను

(||pallavi||)
devaravu gāvā nīvu tĕmali yī panulagu
kāvarabu vanidalu kadisidem̐ jālunu

(||deva||)
sĕkkulam̐ gaḽalu miṁchĕ sedulam̐ jĕmaḍa niṁḍĕ
sŏkkabum̐jūbula nābĕ sūside nīgu
nikkĕm̐ bulagalu mena niddura jārĕm̐ gannula
jakkana nābĕ nīgum̐ bādā lŏttidenu

(||deva||)
sĕlavula navvu vachchĕm̐ jĕṁgaliṁchĕ momĕllā
sŏlabumāḍala nābĕ som̐kanāḍide
niluvĕllā mudamaṁdĕ nĕgaḍĕm̐ goriga madi
sali vāya movi yābĕ savisūbam̐gānu

(||deva||)
serĕ nīgum̐ damagamu siggulu lolo naṇam̐gĕ
kūrimi nābĕ ninnum̐ gūḍam̐gānu
yīridi śhrīveṁkaḍeśha iṁpulāya radulĕllā
gāraviṁchi yābĕ ninnum̐ gaigŏnam̐gānu