దేవర విన్నిటా నీ దేవిని నేను
(॥పల్లవి॥)
దేవర విన్నిటా నీ దేవిని నేను
నీవే నా కిన్నియును నేరుపుదుగాక
(॥దేవ॥)
యెక్కుడుమాట నీవన్నా యెదురాడఁ దగవా
అక్కర మంకుదనాన నాడితిఁగాక
యిక్కువైనతగవు నీవెఱఁగనివాఁడవా
చొక్కముగా నామనసు సోదించేవుగాక
(॥దేవ॥)
తప్పులు నీవు వట్టితే తారుకాణించఁదగవా
అప్పటికోపము లాఁపనైతిఁగాక
కప్పి నీవల్ల నేమైనా కడమలు గలవా
తిప్పి నాచేఁతల నన్నుఁ దిటిచేవుగాక
(॥దేవ॥)
వొత్తి కాఁగిలించుకొంటే వొపననఁదగవా
చిత్తగించి రతి నలసితిఁగాక
కొత్తగా శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నిట్టె
తత్తరపువాడవా దయ ఇదిగాక
(||pallavi||)
devara vinniḍā nī devini nenu
nīve nā kinniyunu nerubudugāga
(||deva||)
yĕkkuḍumāḍa nīvannā yĕdurāḍam̐ dagavā
akkara maṁkudanāna nāḍidim̐gāga
yikkuvainadagavu nīvĕṟam̐ganivām̐ḍavā
sŏkkamugā nāmanasu sodiṁchevugāga
(||deva||)
tappulu nīvu vaṭṭide tārugāṇiṁcham̐dagavā
appaḍigobamu lām̐panaidim̐gāga
kappi nīvalla nemainā kaḍamalu galavā
tippi nāsem̐tala nannum̐ diḍisevugāga
(||deva||)
vŏtti kām̐giliṁchugŏṁṭe vŏbananam̐dagavā
sittagiṁchi radi nalasidim̐gāga
kŏttagā śhrī veṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
tattarabuvāḍavā daya idigāga