Devara gunamulu deliyavu

దేవర గుణములు దెలియవు
Language

(॥పల్లవి॥)
దేవర గుణములు దెలియవు
నీవే మాకును నేరుపవయ్యా

(॥॥)
వదలక నీతో వాసికిఁ బెనఁగిన
యెదుటనె నీమనసెట్టుండునో
కదిసి నీరతికిఁ గడుదమకించిన
యిది వేసాలని యెంతువో నీవు

(॥॥)
చెనకఁగ నీయెడ సిగ్గులు నెరపిన
పనులవి యేమని భావింతువో
ననిచి నీయెదుట నవ్వులు నవ్విన
తనివిలేనిదని తగ నాడుదువొ

(॥॥)
కూడుచు నిన్నిటు గుబ్బల నొత్తిన
వోడ దనుచు గో రూఁదుదువో
యీడనె శ్రీవేంకటేశ యేలితివి
వీడె మిచ్చితే వెరగందుదువో

(||pallavi||)
devara guṇamulu dĕliyavu
nīve māgunu nerubavayyā

(||||)
vadalaga nīdo vāsigim̐ bĕnam̐gina
yĕduḍanĕ nīmanasĕṭṭuṁḍuno
kadisi nīradigim̐ gaḍudamagiṁchina
yidi vesālani yĕṁtuvo nīvu

(||||)
sĕnagam̐ga nīyĕḍa siggulu nĕrabina
panulavi yemani bhāviṁtuvo
nanisi nīyĕduḍa navvulu navvina
tanivilenidani taga nāḍuduvŏ

(||||)
kūḍusu ninniḍu gubbala nŏttina
voḍa danusu go rūm̐duduvo
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi
vīḍĕ michchide vĕragaṁduduvo