Devadevottama naagu dikku neeve yeppudunu

దేవదేవోత్తమ నాకు దిక్కు నీవే యెప్పుడును
Language

(॥పల్లవి॥)
దేవదేవోత్తమ నాకు దిక్కు నీవే యెప్పుడును
యే వివరముఁ దెలియ నేమి సేతునయ్యా

(॥దేవ॥)
పాపముడిగినఁ గాని ఫలియించదు పుణ్యము
కోపము మానినఁ గాని కూడదు శాంతి
చాపల మడఁచక నిశ్చల బుద్ధి గలుగదు
యేపున నా వసము గా దేమి సేతు నయ్యా

(॥దేవ॥)
ఆస విడిచినఁ గాని యంకెకు రాదు విరతి
రోసినఁ గాని సుజ్ఞానరుచి వుట్టదు
వేసాలు దొలఁగించక వివేకా లెల్లా మెచ్చరు
యీ సుద్దు లేమియు నేర నేమి సేతు నయ్యా

(॥దేవ॥)
కల్లలాడకున్నఁ గాని కడతేరదు సత్యము
వొల్ల నన్నఁ గాని సుఖ మొనఁ గూడదు
యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
యెల్లకాల మీ మేలున కేమి సేతు నయ్యా

(||pallavi||)
devadevottama nāgu dikku nīve yĕppuḍunu
ye vivaramum̐ dĕliya nemi sedunayyā

(||deva||)
pābamuḍiginam̐ gāni phaliyiṁchadu puṇyamu
kobamu māninam̐ gāni kūḍadu śhāṁti
sābala maḍam̐saga niśhchala buddhi galugadu
yebuna nā vasamu gā demi sedu nayyā

(||deva||)
āsa viḍisinam̐ gāni yaṁkĕgu rādu viradi
rosinam̐ gāni sujñānarusi vuṭṭadu
vesālu dŏlam̐giṁchaga vivegā lĕllā mĕchcharu
yī suddu lemiyu nera nemi sedu nayyā

(||deva||)
kallalāḍagunnam̐ gāni kaḍaderadu satyamu
vŏlla nannam̐ gāni sukha mŏnam̐ gūḍadu
yillidĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
yĕllagāla mī meluna kemi sedu nayyā