Devadeva nee divyamahima livi

దేవదేవ నీ దివ్యమహిమ లివి
Language

(॥పల్లవి॥)
దేవదేవ నీ దివ్యమహిమ లివి
నీ వొక్కఁడవే నిఖిలకర్తవూ

(॥దేవ॥)
అనిశము సురలకు నటు రక్షకుఁడవు
దనుజులకు లయాంతకుఁడవూ
దినముఁ బితాళ్లకు తృప్తికరుండవు
జనుల కెల్ల సంసారసుఖమవూ

(॥దేవ॥)
మునులకు సంతత మోక్షప్రదుఁడవు
ఘనగ్రహములకు కాలమవూ
అనయము సిద్ధుల కక్షయ ఘుటికవు
నినుఁ గనువారికి నిధానమవూ

(॥దేవ॥)
బహువేదములకు పరమార్థంబవు
సహజ జగములకు శరీరివీ
మహిమల నలమేల్మంగకు మగఁడవు
యిహమునకు శ్రీవేంకటేశ వరదుఁడవూ

(||pallavi||)
devadeva nī divyamahima livi
nī vŏkkam̐ḍave nikhilagardavū

(||deva||)
aniśhamu suralagu naḍu rakṣhagum̐ḍavu
danujulagu layāṁtagum̐ḍavū
dinamum̐ bidāḽlagu tṛptigaruṁḍavu
janula kĕlla saṁsārasukhamavū

(||deva||)
munulagu saṁtada mokṣhapradum̐ḍavu
ghanagrahamulagu kālamavū
anayamu siddhula kakṣhaya ghuḍigavu
ninum̐ ganuvārigi nidhānamavū

(||deva||)
bahuvedamulagu paramārdhaṁbavu
sahaja jagamulagu śharīrivī
mahimala nalamelmaṁgagu magam̐ḍavu
yihamunagu śhrīveṁkaḍeśha varadum̐ḍavū