దేవ నీ వునికి తేటతెల్లమాయను
(॥పల్లవి॥)
దేవ నీ వునికి తేటతెల్లమాయను
భావించ మాకుఁ గన్నులపండుగాయను
(॥దేవ॥)
పన్నీటిజలకములు బామ కనుచూపులును
యెన్నికఁ గూడుక నీపై నేరులై పారె
తిన్నని చెమలెల్లా తిరుమేననెల్లా నిండె
అన్నిటా ముతేల పేనుహారములాయ
(॥దేవ॥)
తెల్లనికప్పురకాపు తెఱవనవ్వులుఁ గూడి
పొల్లుగా నీపుప్పొళ్ల పోగులాయను
మెల్లనే నీవూరుపుల మించులరవలు రేఁగె
వొల్లనే తడిసూళ్లవొత్తులాయను
(॥దేవ॥)
అంగపుఁ బుళుగు కాపు అలమేలుమంగఁ గూడి
సింగారాలాయను మంచుసిరులాయను
ముంగిట శ్రీ వేంకటేశ మోహనపు నీకూటమి
సంగతిఁ బూవుదండల జాడలాయను
(||pallavi||)
deva nī vunigi teḍadĕllamāyanu
bhāviṁcha māgum̐ gannulabaṁḍugāyanu
(||deva||)
pannīḍijalagamulu bāma kanusūbulunu
yĕnnigam̐ gūḍuga nībai nerulai pārĕ
tinnani sĕmalĕllā tirumenanĕllā niṁḍĕ
anniḍā mudela penuhāramulāya
(||deva||)
tĕllanigappuragābu tĕṟavanavvulum̐ gūḍi
pŏllugā nībuppŏḽla pogulāyanu
mĕllane nīvūrubula miṁchularavalu rem̐gĕ
vŏllane taḍisūḽlavŏttulāyanu
(||deva||)
aṁgabum̐ buḽugu kābu alamelumaṁgam̐ gūḍi
siṁgārālāyanu maṁchusirulāyanu
muṁgiḍa śhrī veṁkaḍeśha mohanabu nīgūḍami
saṁgadim̐ būvudaṁḍala jāḍalāyanu