Deva naavalana gunamu telisi kaase nanedi

దేవ నావలన గుణము తెలిసి కాచే ననేటి
Language

(॥పల్లవి॥)
దేవ నావలన గుణము తెలిసి కాచే ననేటి
యీ వెఱ్ఱితనము మాని యిట్టే నన్నుఁ గావవే

(॥దేవ॥)
నేరుపే నాకుఁ గలిగితే నెట్టన నింద్రియముల
బారిఁబడి బంటనై పంపుసేతునా
ఆరీతి నేనే వివేకి నైతే హేయపుమేను
కోరి బ్రహ్మ మని నమ్మి కొంకక గర్వింతునా

(॥దేవ॥)
నాలో బుద్ధి గలిగితే నలిఁ గామక్రోధములు
యీ లీల నాసొమ్ము లని యెన్నుకొందునా
తాలిమి నాయందు మంచితనములు గలిగితే
మూల నున్న నా కర్మములే కట్టివేసునా

(॥దేవ॥)
చిత్తమే కైవసమైతే చేరి సుఖదుఃఖముల
మత్తుఁడనై మఱచి యేమరివుందునా
అత్తిన శ్రీ వేంకటేశ అంతర్యామిని నీవు
తత్తరపు నా పసనీ వెఱుఁగవా

(||pallavi||)
deva nāvalana guṇamu tĕlisi kāse naneḍi
yī vĕṭridanamu māni yiṭṭe nannum̐ gāvave

(||deva||)
nerube nāgum̐ galigide nĕṭṭana niṁdriyamula
bārim̐baḍi baṁṭanai paṁpusedunā
ārīdi nene vivegi naide heyabumenu
kori brahma mani nammi kŏṁkaga garviṁtunā

(||deva||)
nālo buddhi galigide nalim̐ gāmakrodhamulu
yī līla nāsŏmmu lani yĕnnugŏṁdunā
tālimi nāyaṁdu maṁchidanamulu galigide
mūla nunna nā karmamule kaṭṭivesunā

(||deva||)
sittame kaivasamaide seri sukhaduḥkhamula
mattum̐ḍanai maṟasi yemarivuṁdunā
attina śhrī veṁkaḍeśha aṁtaryāmini nīvu
tattarabu nā pasanī vĕṟum̐gavā