(॥పల్లవి॥)
దేహంబొకటే దేహియు నొకఁడే
దాహంబెంతటఁ దనియునో తలఁపు
(॥దేహం॥)
వినుకలి వెంట వెడలీఁ దలఁపు
కనుకలి వెంటఁ గదలీఁ దలఁపు
కొననాలుక మదిఁ గూడీఁ దలఁపు
తునిగిన యెన్నెన్ని తునకలో తలఁపు
(॥దేహం॥)
నయమగు చోటను నవ్వీఁ దలఁపు
భయమగు చోటను బడలీఁ దలఁపు
లయమై నిద్రల లవమౌఁ దలఁపు
క్రియ నెందరి పంగెనయో తలఁపు
(॥దేహం॥)
భావించిన గతిఁ బారీఁ దలఁపు
వేవేలు గతుల వెలసీఁ దలఁపు
శ్రీవేంకటపతి చిత్తము లోపల
నీవే తెలుపఁగ నినుఁగనె తలఁపు
(||pallavi||)
dehaṁbŏgaḍe dehiyu nŏgam̐ḍe
dāhaṁbĕṁtaḍam̐ daniyuno talam̐pu
(||dehaṁ||)
vinugali vĕṁṭa vĕḍalīm̐ dalam̐pu
kanugali vĕṁṭam̐ gadalīm̐ dalam̐pu
kŏnanāluga madim̐ gūḍīm̐ dalam̐pu
tunigina yĕnnĕnni tunagalo talam̐pu
(||dehaṁ||)
nayamagu soḍanu navvīm̐ dalam̐pu
bhayamagu soḍanu baḍalīm̐ dalam̐pu
layamai nidrala lavamaum̐ dalam̐pu
kriya nĕṁdari paṁgĕnayo talam̐pu
(||dehaṁ||)
bhāviṁchina gadim̐ bārīm̐ dalam̐pu
vevelu gadula vĕlasīm̐ dalam̐pu
śhrīveṁkaḍabadi sittamu lobala
nīve tĕlubam̐ga ninum̐ganĕ talam̐pu