Deha midi yogade devumda neevogamdave

దేహ మిది యొకటే దేవుఁడ నీవొకఁడవే
Language

(॥పల్లవి॥)
దేహ మిది యొకటే దేవుఁడ నీవొకఁడవే
యీహల రెంట దెప్పర మిదివో మాబదుకు

(॥దేహ॥)
రాతి రొక్కలోకము రవ్వపడెఁ గలలోన
ఘాతలఁ బగలొక్కలోకము వేగితే
యీతల రెప్పలే మరఁ గిందుకు నందుకుఁ జూడ
యేతుల రెంట దెప్పర మిదివో మాబదుకు

(॥దేహ॥)
సతి కాఁగిలొకటే జవ్వనపుఁగాఁక రేఁచు
సుత కాఁగిలొక వేరేసుఖమై తోఁచు
మతిలోని మరఁ గింతే మగువలే యిద్దరును
ఇతవై రెంట దెప్పర మిదివో మాబదుకు

(॥దేహ॥)
దైవమా నిన్నాతుమలోఁ దలఁచి యానందింతు
పూవుల నిన్నుఁ బూజింతు పొంచి వెలిని
శ్రీవేంకటేశ నీసేవలోని మరఁ గింతే
యీవల రెంట దెప్పర మిదివో మాబదుకు

(||pallavi||)
deha midi yŏgaḍe devum̐ḍa nīvŏgam̐ḍave
yīhala rĕṁṭa dĕppara midivo mābadugu

(||deha||)
rādi rŏkkalogamu ravvabaḍĕm̐ galalona
ghādalam̐ bagalŏkkalogamu vegide
yīdala rĕppale maram̐ giṁdugu naṁdugum̐ jūḍa
yedula rĕṁṭa dĕppara midivo mābadugu

(||deha||)
sadi kām̐gilŏgaḍe javvanabum̐gām̐ka rem̐su
suda kām̐gilŏga veresukhamai tom̐su
madiloni maram̐ giṁte maguvale yiddarunu
idavai rĕṁṭa dĕppara midivo mābadugu

(||deha||)
daivamā ninnādumalom̐ dalam̐si yānaṁdiṁtu
pūvula ninnum̐ būjiṁtu pŏṁchi vĕlini
śhrīveṁkaḍeśha nīsevaloni maram̐ giṁte
yīvala rĕṁṭa dĕppara midivo mābadugu