దీనికేమే దోసమా తీపు మొగచాటైతే
(॥పల్లవి॥)
దీనికేమే దోసమా తీపు మొగచాటైతే
పూనుక నడుమఁ గొంత పులుసును నంజరా
(॥దీని॥)
మంచముపైఁ గూచుండి మాయలెల్లా నటిఇంచి
కంచము పొత్తు వలపు కలసితివే
అంచెల నా మానిసివై అంటుకొంటి వంతలోనె
యెంచేదేమి ఇఁక బాసలేల సే సేవే
(॥దీని॥)
వద్దనుండి పాటవాడి వరుసలు వెట్టుకొని
చద్ది కూటిపై నుమిసి సాదించితివే
అద్దుక రాయబారాలు ఆడుతానే మించితివి
తిద్దుక ఇంకానేల దిష్టాలు సే సేవే
(॥దీని॥)
అంకెలఁ బాదములొత్తి ఆయములు సోఁకించి
కంకి సేసి తగవులు గైకొంటివే
వుంకువై శ్రీ వేంకటేశుఁ డొనరె నా కాఁగిటను
పొంకాన నావశమైతి బుద్దులేల చెప్పేవే
(||pallavi||)
dīnigeme dosamā tību mŏgasāḍaide
pūnuga naḍumam̐ gŏṁta pulusunu naṁjarā
(||dīni||)
maṁchamubaim̐ gūsuṁḍi māyalĕllā naḍiiṁchi
kaṁchamu pŏttu valabu kalasidive
aṁchĕla nā mānisivai aṁṭugŏṁṭi vaṁtalonĕ
yĕṁchedemi im̐ka bāsalela se seve
(||dīni||)
vaddanuṁḍi pāḍavāḍi varusalu vĕṭṭugŏni
saddi kūḍibai numisi sādiṁchidive
adduga rāyabārālu āḍudāne miṁchidivi
tidduga iṁkānela diṣhṭālu se seve
(||dīni||)
aṁkĕlam̐ bādamulŏtti āyamulu som̐kiṁchi
kaṁki sesi tagavulu gaigŏṁṭive
vuṁkuvai śhrī veṁkaḍeśhum̐ ḍŏnarĕ nā kām̐giḍanu
pŏṁkāna nāvaśhamaidi buddulela sĕppeve