దయవుట్టీ నీకు నీకె తమకించి చెప్పనేల
(॥పల్లవి॥)
దయవుట్టీ నీకు నీకె తమకించి చెప్పనేల
నియతాన నీకె మేలు నెరవేర్చవయ్యా
(॥దయ॥)
చెక్కునజారేచెమట సెలవులఁ జిఱునవ్వు
చక్కనిమాటలలోని సాదింపులు
పిక్కటిల్లుఁ జన్నులపై పెడఁబాసినపయ్యద
అక్కరతో నీవే చూడ నవధరించవయ్యా
(॥దయ॥)
వీడినవెన్నుపై కొప్పు వేమారులు నిట్టూర్పులు
వీడెపే మోపిమీఁది వింతసన్నలు
వాడుదేరేమేనిపై జవ్వనమదముసొంపులు
వేడుకతో నీవె ఇన్ని విచారించవయ్యా
(॥దయ॥)
మనసులో తలపోఁత మర్మములబయలీఁత
తనివోనిచూపులలో తరితీపులు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్ మంగను
చనవిచ్చి ఇంకా నీవే సరసమాడవయ్యా
(||pallavi||)
dayavuṭṭī nīgu nīgĕ tamagiṁchi sĕppanela
niyadāna nīgĕ melu nĕraversavayyā
(||daya||)
sĕkkunajāresĕmaḍa sĕlavulam̐ jiṟunavvu
sakkanimāḍalaloni sādiṁpulu
pikkaḍillum̐ jannulabai pĕḍam̐bāsinabayyada
akkarado nīve sūḍa navadhariṁchavayyā
(||daya||)
vīḍinavĕnnubai kŏppu vemārulu niṭṭūrbulu
vīḍĕbe mobimīm̐di viṁtasannalu
vāḍuderemenibai javvanamadamusŏṁpulu
veḍugado nīvĕ inni visāriṁchavayyā
(||daya||)
manasulo talabom̐ta marmamulabayalīm̐ta
tanivonisūbulalo taridībulu
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamel maṁganu
sanavichchi iṁkā nīve sarasamāḍavayyā