Dayam joosi rakshimchede tagavu neegu

దయఁ జూచి రక్షించేదే తగవు నీకు
Language

(॥పల్లవి॥)
దయఁ జూచి రక్షించేదే తగవు నీకు
ప్రియములు చెప్పఁగాను పెనఁగఁగ నేఁటికి

(॥॥)
జంకెన లెంతచూపినా చలమెంత సాదించినా
అంకెల నీచేపట్టిన ఆఁటదే కదా
వుంకువఁ బెండ్లాడితివి వూడిగము గైకొంటివి
బింక మెంత నెరపినా పిన్నదే కదా

(॥॥)
వెక్కసాలెన్నాడినాను వేమారు సొలసినాను
మిక్కిలి నీవు మన్నించేమేనదే కదా
పక్కన నవ్వితి విట్టె బాసలెల్లా నిచ్చితివి
చొక్కిక యెంత మీరినా జోడుదే కదా

(॥॥)
పైపై నెంతగొసరినా పంతా లెట్టు నొడిగినా
యేపొద్దు నిన్నుఁ బాయనిఇంటిదే కదా
రాఁపుగా శ్రీ వేంకటెశ రమణి నేలితి విట్టె
యేపనులు చెప్పినా నీయింపుదే కదా

(||pallavi||)
dayam̐ jūsi rakṣhiṁchede tagavu nīgu
priyamulu sĕppam̐gānu pĕnam̐gam̐ga nem̐ṭigi

(||||)
jaṁkĕna lĕṁtasūbinā salamĕṁta sādiṁchinā
aṁkĕla nīsebaṭṭina ām̐ṭade kadā
vuṁkuvam̐ bĕṁḍlāḍidivi vūḍigamu gaigŏṁṭivi
biṁka mĕṁta nĕrabinā pinnade kadā

(||||)
vĕkkasālĕnnāḍinānu vemāru sŏlasinānu
mikkili nīvu manniṁchemenade kadā
pakkana navvidi viṭṭĕ bāsalĕllā nichchidivi
sŏkkiga yĕṁta mīrinā joḍude kadā

(||||)
paibai nĕṁtagŏsarinā paṁtā lĕṭṭu nŏḍiginā
yebŏddu ninnum̐ bāyaniiṁṭide kadā
rām̐pugā śhrī veṁkaḍĕśha ramaṇi nelidi viṭṭĕ
yebanulu sĕppinā nīyiṁpude kadā