దయఁ జూడవయా తతిగొని మొక్కేము
(॥పల్లవి॥)
దయఁ జూడవయా తతిగొని మొక్కేము
ప్రియురాండ్లము నినుఁ బెండ్లాడితిమి
(॥॥)
చలములు నీతో సాదించేమా
వలచినవారము వనితలము
బలములు నీతోఁ బచరించేమా
కొలిచినవారము గోలలము
(॥॥)
పెనఁగుచు నీతో బిగి సేమా నీ-
ననుపులవారము నాతులము
పవివడి నేరమి పై వేసేమా
చనవరివారము సాదులము
(॥॥)
యీ వేళఁ గూడితి మొలయించేమా
దేవుళ్లము నీ తెఱవలము
శ్రీ వేంకటేశ్వర చెలఁగి నగేమా
బూవపువారము భోగులము
(||pallavi||)
dayam̐ jūḍavayā tadigŏni mŏkkemu
priyurāṁḍlamu ninum̐ bĕṁḍlāḍidimi
(||||)
salamulu nīdo sādiṁchemā
valasinavāramu vanidalamu
balamulu nīdom̐ basariṁchemā
kŏlisinavāramu golalamu
(||||)
pĕnam̐gusu nīdo bigi semā nī-
nanubulavāramu nādulamu
pavivaḍi nerami pai vesemā
sanavarivāramu sādulamu
(||||)
yī veḽam̐ gūḍidi mŏlayiṁchemā
devuḽlamu nī tĕṟavalamu
śhrī veṁkaḍeśhvara sĕlam̐gi nagemā
būvabuvāramu bhogulamu