Dayagalavaadavu vuttama naayagudavu

దయగలవాడవు వుత్తమ నాయకుడవు
Language

(॥పల్లవి॥)
దయగలవాడవు వుత్తమ నాయకుడవు
ప్రియములు నీకుఁ జెప్పి పిలువ వచ్చితిమి

(॥దయ॥)
చిత్తములోపలి రూపు చిత్తరుపటాన వ్రాసి
హత్తి కాగిలించు కొను నంగన నిన్ను
బత్తిగా నిన్ను దలచి బయలుతో మాటలాడు
ఇత్తల నీపై వలపు లేమని చెప్పేమయ్యా

(॥దయ॥)
పాటమైననీ పేరు పదముల లోన బెట్టి
కూటువ నిన్ను నంకించు కోమలి నిన్నుఁ
నీటున బానుపుమీద నీవున్నాడవని పొందు
యేట వెట్టి నీపై తమి ఇక నెంతో అయ్యా

(॥దయ॥)
కాగిటి లోని రతులు కలవరింతల బెట్టి
మాగిన మోవి యందిచ్చు మగువ నీకు
తోఁగి చూచింతలో నీవే తుద ముట్టి గూడితివి
యేగక శ్రీవేంకటేశ ఇట్టె వుండవయ్యా

(||pallavi||)
dayagalavāḍavu vuttama nāyaguḍavu
priyamulu nīgum̐ jĕppi piluva vachchidimi

(||daya||)
sittamulobali rūbu sittarubaḍāna vrāsi
hatti kāgiliṁchu kŏnu naṁgana ninnu
battigā ninnu dalasi bayaludo māḍalāḍu
ittala nībai valabu lemani sĕppemayyā

(||daya||)
pāḍamainanī peru padamula lona bĕṭṭi
kūḍuva ninnu naṁkiṁchu komali ninnum̐
nīḍuna bānubumīda nīvunnāḍavani pŏṁdu
yeḍa vĕṭṭi nībai tami iga nĕṁto ayyā

(||daya||)
kāgiḍi loni radulu kalavariṁtala bĕṭṭi
māgina movi yaṁdichchu maguva nīgu
tom̐gi sūsiṁtalo nīve tuda muṭṭi gūḍidivi
yegaga śhrīveṁkaḍeśha iṭṭĕ vuṁḍavayyā