దయగలదానవు తమకించకువే ఇట్టె
(॥పల్లవి॥)
దయగలదానవు తమకించకువే ఇట్టె
ప్రియపడఁగానే ఇంక బిగియఁగవచ్చునా
(॥దయ॥)
భావ మెఱిఁగి మెల్లనె పైకొని కూడుటగాక
కైవసమైనవానిఁ గక్కసింతురా
యేవల్లనుండి వచ్చిన యెదురుకొందురుగాక
నీవద్దఁ గూచుండఁగానే నిష్టూరమాడుదురా
(॥దయ॥)
వూరట చేసుకొని వొడఁబరచుటగాక
కూరిమిగలుగు వారిఁ గోపగింతురా
కోరి మచ్చము లుండినా కూర్చుకొనవెలఁగాక
సారె సారెఁ జెనకఁగా సణఁగులాడుదురా
(॥దయ॥)
వేడుకలెల్లాఁ జూపి విన్నవించుకొంటగాక
కూడి శ్రీవేంకటేశుఁ గొసరుదురా
మేడెపురతులలోన మెచ్చులు మెత్తురుగాక
పాడిగా నీతో నవ్వఁగా పంతములాడుదురా
(||pallavi||)
dayagaladānavu tamagiṁchaguve iṭṭĕ
priyabaḍam̐gāne iṁka bigiyam̐gavachchunā
(||daya||)
bhāva mĕṟim̐gi mĕllanĕ paigŏni kūḍuḍagāga
kaivasamainavānim̐ gakkasiṁturā
yevallanuṁḍi vachchina yĕdurugŏṁdurugāga
nīvaddam̐ gūsuṁḍam̐gāne niṣhṭūramāḍudurā
(||daya||)
vūraḍa sesugŏni vŏḍam̐barasuḍagāga
kūrimigalugu vārim̐ gobagiṁturā
kori machchamu luṁḍinā kūrsugŏnavĕlam̐gāga
sārĕ sārĕm̐ jĕnagam̐gā saṇam̐gulāḍudurā
(||daya||)
veḍugalĕllām̐ jūbi vinnaviṁchugŏṁṭagāga
kūḍi śhrīveṁkaḍeśhum̐ gŏsarudurā
meḍĕburadulalona mĕchchulu mĕtturugāga
pāḍigā nīdo navvam̐gā paṁtamulāḍudurā