Daya naabaim gomtainaam dalamside nemaaya

దయ నాపైఁ గొంతైనాఁ దలఁచితే నేమాయ
Language

(॥పల్లవి॥)
దయ నాపైఁ గొంతైనాఁ దలఁచితే నేమాయ
ప్రియురాలఁ గోప మింత పెడరేఁచ నేలరా

(॥దయ॥)
వేఁకమైన విరహన విసిగితి నిందాఁకా
కాఁకమేను నాపై వేసి కాఁక రేఁచ నేలరా
మాఁకువలె నున్నదాన మతి నివ్వెఱగులచే
ఊఁకొను మనుచు గోర నూఁదే వదేలరా

(॥దయ॥)
జవ్వనపు సడిచేత జడిసేటి నాతోను
రవ్వగా నవ్వులు నవ్వి రవ్వ సేయ నేలరా
పువ్వువలె వాడితి నేఁ బొద్దుగడపులచేత
నివ్వలిమోము గ మ్మంటా నింతే శాన లేల రా

(॥దయ॥)
దగ్గరిన సంతసానఁ దల వంచుకున్న నన్ను
సిగ్గరి పెండ్లికొడుక సిగ్గు లందే వేలరా
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
వొగ్గి వీడె మిందమంటా నుప్పతించే వేలరా

(||pallavi||)
daya nābaim̐ gŏṁtainām̐ dalam̐side nemāya
priyurālam̐ goba miṁta pĕḍarem̐sa nelarā

(||daya||)
vem̐kamaina virahana visigidi niṁdām̐kā
kām̐kamenu nābai vesi kām̐ka rem̐sa nelarā
mām̐kuvalĕ nunnadāna madi nivvĕṟagulase
ūm̐kŏnu manusu gora nūm̐de vadelarā

(||daya||)
javvanabu saḍiseda jaḍiseḍi nādonu
ravvagā navvulu navvi ravva seya nelarā
puvvuvalĕ vāḍidi nem̐ bŏddugaḍabulaseda
nivvalimomu ga mmaṁṭā niṁte śhāna lela rā

(||daya||)
daggarina saṁtasānam̐ dala vaṁchugunna nannu
siggari pĕṁḍligŏḍuga siggu laṁde velarā
niggula śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
vŏggi vīḍĕ miṁdamaṁṭā nuppadiṁche velarā