Daya naabaim galigide taane manneemcheem gaaga

దయ నాపైఁ గలిగితే తానే మన్నీంచీఁ గాక
Language

(॥పల్లవి॥)
దయ నాపైఁ గలిగితే తానే మన్నీంచీఁ గాక
ప్పియములు రేఁచిరేఁచి పెనఁగఁగ నేఁటికే

(॥దయ॥)
ననుపుగలిగితెను నవ్వులు తానే వచ్చు
మనసు లెనసితేను మచ్చికవుట్టు
కనుచూపు నాటితేను కడునాస లుప్పతిలు
వెనుకొని పతినంత వేసరించనేఁటికే

(॥దయ॥)
వలపు లొనగూడితే వాడికలు సమకొను
తలపు సరిదాఁకితే తారుకాణలౌ
చెలిమి సతమైతేను చిమ్మిరేఁగుఁ దమకము
బలిమి నతనితోడఁ బదరఁగ నేఁటికే

(॥దయ॥)
వినుకలి దొరసితే వేడుకలు లెలకొను
యెనకులు దలకొంటే చేఁత లీడేరు
యెనసి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
గునిసి యాతని నిఁకఁ గొసరఁగ నేఁటికే

(||pallavi||)
daya nābaim̐ galigide tāne mannīṁchīm̐ gāga
ppiyamulu rem̐sirem̐si pĕnam̐gam̐ga nem̐ṭige

(||daya||)
nanubugaligidĕnu navvulu tāne vachchu
manasu lĕnasidenu machchigavuṭṭu
kanusūbu nāḍidenu kaḍunāsa luppadilu
vĕnugŏni padinaṁta vesariṁchanem̐ṭige

(||daya||)
valabu lŏnagūḍide vāḍigalu samagŏnu
talabu saridām̐kide tārugāṇalau
sĕlimi sadamaidenu simmirem̐gum̐ damagamu
balimi nadanidoḍam̐ badaram̐ga nem̐ṭige

(||daya||)
vinugali dŏraside veḍugalu lĕlagŏnu
yĕnagulu dalagŏṁṭe sem̐ta līḍeru
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
gunisi yādani nim̐kam̐ gŏsaram̐ga nem̐ṭige