Daya dalamsinabude dharmamu neegu

దయ దలఁచినపుడే ధర్మము నీకు
Language

(॥పల్లవి॥)
దయ దలఁచినపుడే ధర్మము నీకు
ప్రియముతోడుత నింక బెరయఁగరాదా

(॥దయ॥)
నలువంక నీతోనే నవ్వులు నవ్వీ నిదే
సొలసి సొలసి నిన్నే చూచీ నిదే
మలసి మలసి నీతో మాటలూనాడీ నిదే
కలికి నింతటనైనఁ గరుణించరాదా

(॥దయ॥)
సారె సారె నీతోనే సన్నలు చేసీ నిదే
కూరిములు పలుమారుఁ గొసరీ నిదే
నేరుపులు గలవెల్ల నీయందే నెరపీ నిదే
నారీమణికి నిట్టే నంటు చూపరాదా

(॥దయ॥)
వింతవింతలుగ నీకె వీడెము లిచ్చీ నిదే
సంతోసాన నిన్నునే జరసీ నిదే
రంతుల శ్రీవేంకటేశ రతులకు మొక్కీ నిదే
యింతిఁ గూడితి విందే యిరవుకోరాదా

(||pallavi||)
daya dalam̐sinabuḍe dharmamu nīgu
priyamudoḍuda niṁka bĕrayam̐garādā

(||daya||)
naluvaṁka nīdone navvulu navvī nide
sŏlasi sŏlasi ninne sūsī nide
malasi malasi nīdo māḍalūnāḍī nide
kaligi niṁtaḍanainam̐ garuṇiṁcharādā

(||daya||)
sārĕ sārĕ nīdone sannalu sesī nide
kūrimulu palumārum̐ gŏsarī nide
nerubulu galavĕlla nīyaṁde nĕrabī nide
nārīmaṇigi niṭṭe naṁṭu sūbarādā

(||daya||)
viṁtaviṁtaluga nīgĕ vīḍĕmu lichchī nide
saṁtosāna ninnune jarasī nide
raṁtula śhrīveṁkaḍeśha radulagu mŏkkī nide
yiṁtim̐ gūḍidi viṁde yiravugorādā