(॥పల్లవి॥)
దయ దలఁచేవాడు తానే కదవే
నయగారి కపటైన నాకు తానే కదవే
(॥దయ॥)
యిక్కడ నేనలిగితే యేల పగచాటినే
తక్కులఁబెట్టేవాడు తానేకదే
వుక్కున నేనూరకుంటే వొట్టేల పెట్టుకొనీనే
యెక్కుడు సేఁత సేసితే నింకఁ దానేకదవే
(॥దయ॥)
పగల నేదిట్టితేను వాదుకేల వచ్చీనే
తగవు వెట్టేవాఁడు తాప కదవే
నగుతా గోరనూఁదితే ననునేల దూరీనే
యెగసక్కేలాడేవాడు యిఁకఁ దానేకదవే
(॥దయ॥)
బలిమి నే గూడితేను పంతము లేలాడీనే
తల మోచి వచ్చినాఁడు తానేకదవే
అలమేలుమంగ నేను అతఁడు శ్రీవేంకటేశుఁ
డిల నన్నుఁ గూడి చొక్కె నింకఁ దానేకదవే
(||pallavi||)
daya dalam̐sevāḍu tāne kadave
nayagāri kabaḍaina nāgu tāne kadave
(||daya||)
yikkaḍa nenaligide yela pagasāḍine
takkulam̐bĕṭṭevāḍu tānegade
vukkuna nenūraguṁṭe vŏṭṭela pĕṭṭugŏnīne
yĕkkuḍu sem̐ta seside niṁkam̐ dānegadave
(||daya||)
pagala nediṭṭidenu vādugela vachchīne
tagavu vĕṭṭevām̐ḍu tāba kadave
nagudā goranūm̐dide nanunela dūrīne
yĕgasakkelāḍevāḍu yim̐kam̐ dānegadave
(||daya||)
balimi ne gūḍidenu paṁtamu lelāḍīne
tala mosi vachchinām̐ḍu tānegadave
alamelumaṁga nenu adam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍila nannum̐ gūḍi sŏkkĕ niṁkam̐ dānegadave