Daya dalamsavaladaa tarunimeemda

దయ దలఁచవలదా తరుణిమీఁద
Language

(॥పల్లవి॥)
దయ దలఁచవలదా తరుణిమీఁద
ప్రియములు రాసివోసి బేరమాడీ నదివో

(॥దయ॥)
మంతనాన నీతోను మాటలాడి మాటలాడి
యెంతైనా దనియదు యీరమణి
వింతైననీ మోము వేడుకతోఁ జూచిచూచి
కొంతైనా రెప్పలు మూసుకొనఁజాల దిదివో

(॥దయ॥)
నలువంక నీతోను నవ్వులు నవ్వి నవ్వి
యెలమితోవేసరదు యీరమణి
చలివాసి చెనకుచు సరసములాడి యాడి
చలము మానుఁగలేదు సంగడినే ఇదివో

(॥దయ॥)
గక్కన నిన్నింతలోనె కాఁగిటఁ గూడికూడి
యిక్కువలు మఱవదు యీరమణి
వెక్కసపురతుల శ్రీవేంకటేశు బొంది పొంది
మిక్కిలివేడుకతోడ మించీ నీపె యిదివో

(||pallavi||)
daya dalam̐savaladā taruṇimīm̐da
priyamulu rāsivosi beramāḍī nadivo

(||daya||)
maṁtanāna nīdonu māḍalāḍi māḍalāḍi
yĕṁtainā daniyadu yīramaṇi
viṁtainanī momu veḍugadom̐ jūsisūsi
kŏṁtainā rĕppalu mūsugŏnam̐jāla didivo

(||daya||)
naluvaṁka nīdonu navvulu navvi navvi
yĕlamidovesaradu yīramaṇi
salivāsi sĕnagusu sarasamulāḍi yāḍi
salamu mānum̐galedu saṁgaḍine idivo

(||daya||)
gakkana ninniṁtalonĕ kām̐giḍam̐ gūḍigūḍi
yikkuvalu maṟavadu yīramaṇi
vĕkkasaburadula śhrīveṁkaḍeśhu bŏṁdi pŏṁdi
mikkiliveḍugadoḍa miṁchī nībĕ yidivo