దయ దలఁచఁగరాదా తరుణిపై నిఁకనైన
(॥పల్లవి॥)
దయ దలఁచఁగరాదా తరుణిపై నిఁకనైన
ప్రియములు చెప్పేనంటాఁ బెనఁగుచు నలసె
(॥దయ॥)
వొగరులాడకుమంత వోపదుచెలి నీతో
నగవుల చేతనే మిన్నక యలసె
జగడాలడువకుమీ సంగతులు గావిఁక
మొగమోడి సారెసారె మొక్కి మొక్కి అలసె
(॥దయ॥)
పంతాలు చూపుకుమంత పనిలేదు యాపెతోను
వింత నీబాసలు విని విని యలసె
చింతలు రేఁచకుమిఁక సేసినట్టెల్లాఁ జెల్లె
అంతరంగముగ నిచ్చలాడి యాడి యలసె
(॥దయ॥)
అలయించుకుమంత ఆరడేల ఇల్లాలితో
కలసి కాఁగిటిలో రతులనలసె
యెలమి శ్రీ వేంకటేశ ఇంతసేసి కూడితివి
అలరిన నీమన్నన లందియంది యలసె
(||pallavi||)
daya dalam̐sam̐garādā taruṇibai nim̐kanaina
priyamulu sĕppenaṁṭām̐ bĕnam̐gusu nalasĕ
(||daya||)
vŏgarulāḍagumaṁta vobadusĕli nīdo
nagavula sedane minnaga yalasĕ
jagaḍālaḍuvagumī saṁgadulu gāvim̐ka
mŏgamoḍi sārĕsārĕ mŏkki mŏkki alasĕ
(||daya||)
paṁtālu sūbugumaṁta paniledu yābĕdonu
viṁta nībāsalu vini vini yalasĕ
siṁtalu rem̐sagumim̐ka sesinaṭṭĕllām̐ jĕllĕ
aṁtaraṁgamuga nichchalāḍi yāḍi yalasĕ
(||daya||)
alayiṁchugumaṁta āraḍela illālido
kalasi kām̐giḍilo radulanalasĕ
yĕlami śhrī veṁkaḍeśha iṁtasesi kūḍidivi
alarina nīmannana laṁdiyaṁdi yalasĕ