దవ్వులనుండి యేమి తరితీపు సేసేవు
(॥పల్లవి॥)
దవ్వులనుండి యేమి తరితీపు సేసేవు
జవ్వనము చిందకుండా జాళెఁ బోయరాదా
(॥దవ్వుల॥)
సిగ్గరి పెండ్లికూఁతురు చేసన్న లెఱుఁగునా
వెగ్గళించి నీవీడకు విచ్చేయరాదా
బగ్గన నక్కడ నిన్ని పనులు గలిగినాను
ముగ్గిన యీవేళకు మూటగట్టరాదా
(॥దవ్వుల॥)
కన్నెపాయపు నెలఁత కందువ మాటెరుఁగునా
పన్ని తెలియఁగ నొడఁబరచరాదా
అన్నిటా నవ్వల నీకు నాసలెన్ని గలిగినా
పెన్నిధిగా యీవేళకు పెట్టెఁ బెట్టరాదా
(॥దవ్వుల॥)
చెలువపు ముద్దరాలు చెనకు లివేమెరుఁగు
కలసి కాఁగిటఁ జేర్చి కైకొనరాదా
అలరి శ్రీవేంకటేశ అతివ నేలితి విట్టె
వలెనా నవ్వీవేళకు వామి వేయరాదా
(||pallavi||)
davvulanuṁḍi yemi taridību sesevu
javvanamu siṁdaguṁḍā jāḽĕm̐ boyarādā
(||davvula||)
siggari pĕṁḍligūm̐turu sesanna lĕṟum̐gunā
vĕggaḽiṁchi nīvīḍagu vichcheyarādā
baggana nakkaḍa ninni panulu galiginānu
muggina yīveḽagu mūḍagaṭṭarādā
(||davvula||)
kannĕbāyabu nĕlam̐ta kaṁduva māḍĕrum̐gunā
panni tĕliyam̐ga nŏḍam̐barasarādā
anniḍā navvala nīgu nāsalĕnni galiginā
pĕnnidhigā yīveḽagu pĕṭṭĕm̐ bĕṭṭarādā
(||davvula||)
sĕluvabu muddarālu sĕnagu livemĕrum̐gu
kalasi kām̐giḍam̐ jersi kaigŏnarādā
alari śhrīveṁkaḍeśha adiva nelidi viṭṭĕ
valĕnā navvīveḽagu vāmi veyarādā