Davvulane vogasimta daggaride nogasimta

దవ్వులనే వొకచింత దగ్గరితే నొకచింత
Language

(॥పల్లవి॥)
దవ్వులనే వొకచింత దగ్గరితే నొకచింత
జవ్వనమే తరవులై సడిబెట్టీ నన్నును

(॥దవ్వుల॥)
కందునో వొకవేళఁ గన్నుల నా రమణుని
విందునొకో వాని సుద్ది వీనుల నేను
అందునొకో వొకమాట అంత నేరుపరి వని
సందడించీ నావలపు జాలిఁబెట్టి నన్నును

(॥దవ్వుల॥)
నగుదునొకో నేను నా సెలవిఁ బతితోను
జగడింతునొకో బొమ్మజంకెనలను
మొగిఁ జేయి వేతునొకో ముంచి వానికౌఁగిటికి
చిగిరించీ వలపులు చిత్తములో నాకును

(॥దవ్వుల॥)
మోవితేనె చిందునొకో ముంచి నావదనమున
వోవల వాఁడిచన్నుల నొత్తుదునొకో
యీవల శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
చేవదేరి నావలపు చిమ్మిరేఁచీ నిపుడు

(||pallavi||)
davvulane vŏgasiṁta daggaride nŏgasiṁta
javvaname taravulai saḍibĕṭṭī nannunu

(||davvula||)
kaṁduno vŏgaveḽam̐ gannula nā ramaṇuni
viṁdunŏgo vāni suddi vīnula nenu
aṁdunŏgo vŏgamāḍa aṁta nerubari vani
saṁdaḍiṁchī nāvalabu jālim̐bĕṭṭi nannunu

(||davvula||)
nagudunŏgo nenu nā sĕlavim̐ badidonu
jagaḍiṁtunŏgo bŏmmajaṁkĕnalanu
mŏgim̐ jeyi vedunŏgo muṁchi vānigaum̐giḍigi
sigiriṁchī valabulu sittamulo nāgunu

(||davvula||)
movidenĕ siṁdunŏgo muṁchi nāvadanamuna
vovala vām̐ḍisannula nŏttudunŏgo
yīvala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
sevaderi nāvalabu simmirem̐sī nibuḍu