దవ్వుల పంతాలు చెల్లె దగ్గరరా
(॥పల్లవి॥)
దవ్వుల పంతాలు చెల్లె దగ్గరరా
యివ్వలనవ్వల మీకు నిద్దరికిఁ దగులు
(॥దవ్వు॥)
కాయములో కరుఁగు కనుచూపులో మొరఁగు
చేయిచెక్కువెరగూ చెలియ కదె
పాయములో బిగువూ పచ్చిమోవినగవూ
యీయెడ నీకే చెల్లె యింతిమనోహరుఁడా
(॥దవ్వు॥)
పలుకులకొదలూ పయ్యెదలోవదలూ
అలకలకదలూ అతివె కదె
నిలువుఁదమకము నిట్టూర్పుగమకము
చెలువుఁడ నీకుఁ జెల్లె చెప్పనిఁకనేలా
(॥దవ్వు॥)
మొనపేటిసిగ్గులూ మోములోని నిగ్గులూ
పనిలేని యెగ్గులూ పడఁతె కదె
యెనసితివి శ్రీవేంకటేశ నీవే విచ్చేసి
వనితకు నీకుఁ జెల్లె వాసు లింతలోనె
(||pallavi||)
davvula paṁtālu sĕllĕ daggararā
yivvalanavvala mīgu niddarigim̐ dagulu
(||davvu||)
kāyamulo karum̐gu kanusūbulo mŏram̐gu
seyisĕkkuvĕragū sĕliya kadĕ
pāyamulo biguvū pachchimovinagavū
yīyĕḍa nīge sĕllĕ yiṁtimanoharum̐ḍā
(||davvu||)
palugulagŏdalū payyĕdalovadalū
alagalagadalū adivĕ kadĕ
niluvum̐damagamu niṭṭūrbugamagamu
sĕluvum̐ḍa nīgum̐ jĕllĕ sĕppanim̐kanelā
(||davvu||)
mŏnabeḍisiggulū momuloni niggulū
panileni yĕggulū paḍam̐tĕ kadĕ
yĕnasidivi śhrīveṁkaḍeśha nīve vichchesi
vanidagu nīgum̐ jĕllĕ vāsu liṁtalonĕ