దవ్వుల కాఁకల నేల తడఁబడేవు
(॥పల్లవి॥)
దవ్వుల కాఁకల నేల తడఁబడేవు
యివ్వల నాపెఁ గూడఁగా నేలనే మానేము
(॥॥)
కలువ కన్నుల నాపె గక్కున నిన్నుఁ జూచితే
వలరాజు బాణా లంటా వసివాడేవు
వలపింత గలిగితే వద్దికిఁ బిలుచుకొని
కలయఁగా వద్దనేమా కడనుండి నేము
(॥॥)
అంది వెన్నెల నవ్వుల అల్లంతఁ జల్లితే
చందమామ గుటుక లంటా జాలి గొనేవు
పొందు నీకు వేడుకైతే పొలఁతికి నుంకు విచ్చి
కందువఁ బెండ్లాడఁ గాను కాదనేమా నేము
(॥॥)
ముసురుఁ దేనె పలుకు మోవి నాపె చిలికితే
వసంతుని విందు లంటా వడిఁగోరేవు
యెసగి శ్రీ వేంకటేశ యిందాఁకా నన్నేలితివి
కొసరింతిఁ దెచ్చుకొఁగా కొత్తనేమా నేము
(||pallavi||)
davvula kām̐kala nela taḍam̐baḍevu
yivvala nābĕm̐ gūḍam̐gā nelane mānemu
(||||)
kaluva kannula nābĕ gakkuna ninnum̐ jūside
valarāju bāṇā laṁṭā vasivāḍevu
valabiṁta galigide vaddigim̐ bilusugŏni
kalayam̐gā vaddanemā kaḍanuṁḍi nemu
(||||)
aṁdi vĕnnĕla navvula allaṁtam̐ jallide
saṁdamāma guḍuga laṁṭā jāli gŏnevu
pŏṁdu nīgu veḍugaide pŏlam̐tigi nuṁku vichchi
kaṁduvam̐ bĕṁḍlāḍam̐ gānu kādanemā nemu
(||||)
musurum̐ denĕ palugu movi nābĕ siligide
vasaṁtuni viṁdu laṁṭā vaḍim̐gorevu
yĕsagi śhrī veṁkaḍeśha yiṁdām̐kā nannelidivi
kŏsariṁtim̐ dĕchchugŏm̐gā kŏttanemā nemu