దండనున్న చెలుల మిందరము సాక్షి
(॥పల్లవి॥)
దండనున్న చెలుల మిందరము సాక్షి
నిండుదొర యీతనికి నేరమేమీ లేదు
(॥దండ॥)
వట్టి చలములు మాని వాకిలి దెరవరాదా
యిట్టె విభుడుఁ వచ్చి యీడనున్నాఁడు
వొట్టినట్టు కొలువై వుండినదొక్కటేకాని
నెట్టన నితనివల్ల నేరమేమీ లేదు
(॥దండ॥)
దిచ్చరి కోపము మాని తెర దియ్యరాదా
చొచ్చి వచ్చి రమణుఁడు చూచీ నిదే
అచ్చముగ సరసములాడినదొక్కటే కాని
నిచ్చలు నితనివల్ల నేరమేమీ లేదు
(॥దండ॥)
పంతపు వేసాలు మాని పయ్యెదెడలించరాదా
చెంత శ్రీవేంకటేశుఁడు చేయి చాఁచీని
యింతలోన నిన్నుఁ గూడె నిది యొక్కటే గాని
నింతము సేసలితని నేరమేమీ లేదు
(||pallavi||)
daṁḍanunna sĕlula miṁdaramu sākṣhi
niṁḍudŏra yīdanigi neramemī ledu
(||daṁḍa||)
vaṭṭi salamulu māni vāgili dĕravarādā
yiṭṭĕ vibhuḍum̐ vachchi yīḍanunnām̐ḍu
vŏṭṭinaṭṭu kŏluvai vuṁḍinadŏkkaḍegāni
nĕṭṭana nidanivalla neramemī ledu
(||daṁḍa||)
dichchari kobamu māni tĕra diyyarādā
sŏchchi vachchi ramaṇum̐ḍu sūsī nide
achchamuga sarasamulāḍinadŏkkaḍe kāni
nichchalu nidanivalla neramemī ledu
(||daṁḍa||)
paṁtabu vesālu māni payyĕdĕḍaliṁcharādā
sĕṁta śhrīveṁkaḍeśhum̐ḍu seyi sām̐sīni
yiṁtalona ninnum̐ gūḍĕ nidi yŏkkaḍe gāni
niṁtamu sesalidani neramemī ledu